యాక్టివేటెడ్ చార్ కోల్.. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. కర్రలను కాల్చడం వల్ల వచ్చే బొగ్గును చార్ కోల్ అంటారు. అయితే ఆ చార్ కోల్‌నే యాక్టివేటెడ్ చార్ కోల్ అని భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే యాక్టివేటెడ్ చార్ కోల్ వేరే. అది నలుపు రంగులో ఉండే ఒక పొడి. కొబ్బరి టెంకలను లేదా పొట్టును కాల్చడం వల్ల అది తయారవుతుంది. దాన్ని పొడి రూపంలో తయారు చేసి విక్రయిస్తారు. మార్కెట్‌లో మనకు ఇది లభిస్తుంది. ఈ క్రమంలోనే యాక్టివేటెడ్ చార్ కోల్ వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మన పూర్వీకులు బొగ్గుతో దంతాలను తోముకునేవారు. ఇప్పటికీ కొన్ని చోట్ల కొందరు బొగ్గుతోనే దంతాలను తోముకుంటుంటారు. అయితే యాక్టివేటెడ్ చార్‌కోల్‌తో దంతాలను తోముకోవడం వల్ల దంతాలు శుభ్రంగా, తెల్లగా మారుతాయి. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. నోరు శుభ్రంగా మారుతుంది.
2. యాక్టివేటెడ్ చార్ కోల్‌కు చెందిన ట్యాబ్లెట్లు మనకు లభిస్తాయి. వాటిని రోజూ ఉదయం సాయంత్రం భోజనానికి గంట ముందు 500 మిల్లీగ్రాముల మోతాదులో వేసుకోవాలి. దీంతో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం ఉండవు. మలబద్దకం తగ్గుతుంది.
3. మనం తీసుకునే ఆహారాలు, ద్రవాల వల్ల అప్పుడప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అవుతుంటుంది. దీంతో విరేచనాలు, వాంతులు అవుతాయి. ఈ సమస్యలు తగ్గాలంటే యాక్టివేటెడ్ చార్‌కోల్ ట్యాబ్లెట్లను వాడాలి. పూటకు ఒకటి చొప్పున 500 మిల్లీగ్రాముల మోతాదులో వాడితే ఫలితం ఉంటుంది.
4. శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలు బయటకు పోయి శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారాలంటే యాక్టివేటెడ్ చార్‌కోల్ ట్యాబ్లెట్లను వారం రోజుల పాటు వాడాలి. వాటిని ఉదయం, సాయంత్రం ఒక్క ట్యాబ్లెట్ చొప్పున 250 మిల్లీగ్రాముల మోతాదులో వాడితే శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు పోతాయి.
5. మద్యం విపరీతంగా సేవించడం వల్ల హ్యాంగోవర్ సమస్య వస్తుంది. అలాంటప్పుడు యాక్టివేటెడ్ చార్‌కోల్‌ను వాడితే ఫలితం ఉంటుంది.
6. పురుగులు కుట్టిన చోట యాక్టివేటెడ్ చార్‌కోల్‌ను కొబ్బరినూనెతో కలిపి రాయాలి. సమస్య వెంటనే తగ్గుతుంది.
7. చర్మాన్ని సహజసిద్ధంగా డిటాక్స్ చేసే గుణాలు యాక్టివేటెడ్ చార్‌కోల్‌లో ఉన్నాయి. దీంతో ఫేస్ మాస్క్‌లను తయారు చేసి ఉపయోగిస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365