బెండకాయలను చాలా మంది ఫ్రై లేదా పులుసు లేదా టమాటాలతో కలిపి వండుకుని తింటుంటారు. బెండకాయలను చక్కగా వండాలేగానీ ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మందికి బెండకాయలు అంటే ఇష్టమే. అయితే వీటిలో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. బెండకాయలను ఉపయోగించి పలు సమస్యలను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రెండు బెండకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని పొడవునా మధ్యలో చీరాలి. తరువాత ఆ ముక్కలను నీటిలో వేయాలి. రాత్రంతా ఆ ముక్కలను నీటిలో అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే ఆ నీటిని తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
2. బెండకాయల నుంచి వచ్చే జిగురును కాలిన గాయాలపై రాస్తుండాలి. దీంతో గాయాలు త్వరగా మానుతాయి.
3. బెండకాయల గింజలను 30-40 తీసుకుని వాటిని నీడలో ఎండబెట్టి పొడి చేయాలి. తరువాత ఆ పొడిని నువ్వుల నూనె లేదా కొబ్బరినూనెలో ఒక రోజంతా నానబెట్టాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని మంటపై ఉంచాలి. 5-10 నిమిషాల పాటు ఉంచాక చల్లార్చి ఫిల్టర్ చేసి నిల్వ ఉంచుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలకు రాసి కొంతసేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. చుండ్రు తగ్గుతుంది.
4. బెండకాయలను గుజ్జుగా చేసి ఆ మిశ్రమాన్ని మొటిమలపై రాస్తుంటే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
5. వైట్ డిశ్చార్జి సమస్యతో బాధపడే మహిళలు బెండకాయలను తరచూ తీసుకుంటుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365