చిట్కాలు

ఆవ‌నూనెతో మీ ముఖం అందంగా మారుతుంది తెలుసా..?

ముఖం అందంగా కనిపించడానికి ఏ ప్రయత్నమైనా చేస్తుంటాం. ముఖంపై వచ్చే మచ్చలు, మొటిమలు, ముడుతలు చికాకు కలిగించి మానసికంగా చాలా ప్రభావితం చేస్తుంటాయి. అందువల్ల వాటిని పోగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో వీటిపై ఎన్నో రకాల ప్రోడక్టులు అందుబాటులో ఉన్నాయి. ఐతే అవన్నీ చాలా ఖరీదైనవి. ఖరీదైన వాటిని వాడడానికి ఉత్సాహం చూపించక పక్కన పడేస్తుంటారు. ఐతే ముఖంపై వచ్చే సమస్యలని పోగొట్టడానికి ఇంట్లోనే ఔషధం చేసుకోవచ్చు. దీనికి ఆవనూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖంపై వచ్చే మచ్చలు, మొటిమలు, ముడుతలు రాకుండా ఆవనూనె ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

రోజూ స్నానం చేసే ముందు ఆవాల నూనెని ముఖానికి రాసుకుని కొద్దిసేపయ్యాక కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే ముడుతలు తగ్గుతాయి. ముఖంపై నల్లమచ్చలు పోగొట్టడానికి ఆవాలనూనె కి కొంచెం శనగపిండీ, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా ఒక మూడు వారాల పాటు చేస్తూ ఉంటే నల్లమచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి. ముఖం అందంగా కనిపించడానికి చర్మంపై మచ్చలు, మొటిమలు లేకపోవడమే కాదు, పెదాలు, పళ్ళు అందంగా కనిపించాలి. పెదాలు ఎండిపోయి, పళ్ళు పచ్చగా ఉంటే ముఖం అందంగా కనిపించదు.

here it is how you can you mustard oil for beauty

పెదాలు పొడిబారకుండా ఉండేందుకు.. ఆవాల నూనెని నాభి దగ్గర రోజూ పడుకునే ముందు రాసుకుంటే పొడిబారిన పెదాలు తేమగా తయారవుతాయి. పగులుతూ కనిపించే పెదాలు ఆరోగ్యంగా కనిపిస్తాయి. బ్రష్ చేసుకునేటపుడు కొంచెం ఆవనూనె బ్రష్ కి తగిలించి, ఆ తర్వాత దానికి రెండు నిమ్మరసం చుక్కలు కలిపి, కొద్దిగా ఉప్పు మిక్స్ చేసి బ్రష్ చేస్తే కొద్ది రోజుల్లోనే పళ్ళు మిల మిలా మెరుస్తుంటాయి. సో.. ఇదండీ ఆవాల వల్ల ఉపయోగం.. అందమైన ముఖానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతున్న ఆవాలు మన వంటింట్లోనే దొరుకుతాయి.

Admin

Recent Posts