Holy Basil Leaves : రోజూ ప‌ర‌గ‌డుపున 4 లేదా 5 తుల‌సి ఆకుల‌ను ఇలా తీసుకోండి.. చెప్ప‌లేన‌న్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Holy Basil Leaves : మ‌నం ఎంతో ప‌విత్రంగా భావించి పూజించే మొక్క‌ల‌ల్లో తుల‌సి మొక్క కూడా ఒక‌టి. తుల‌సి మొక్క‌కు హిందూ సాంప్ర‌దాయంలో ఎతో ప్రాధాన్యత ఉంది. తుల‌సి చెట్టుకు నిత్యం ఎంతో భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో పూజ‌లు చేస్తూ ఉంటారు. కేవ‌లం ఆధ్యాత్మికంగానే ఔష‌ధ ప‌రంగానూ తుల‌సి మొక్క ఎంతో విశిష్టత‌ను క‌లిగి ఉంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. తుల‌సి ఆకుల‌ను మ‌నం ఔష‌ధంగా తీసుకుంటూ ఉంటాము. అయితే తుల‌సి ఆకుల‌ను వ‌ర్షాకాలంలో త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. అస‌లు తుల‌సి ఆకుల్లో ఉండే ఔష‌ధ గుణాలు ఏమిటి.. వీటిని వ‌ర్షాకాలంలో ఖ‌చ్చితంగా ఎందుకు తీసుకోవాలి.. తుల‌సి ఆకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజనాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వ‌ర్షాకాలంలో వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్యలు, జ్వ‌రాలు, అంటు వ్యాధుల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో తుల‌సి ఆకులు మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. తుల‌సి ఆకుల్లో యాంటీ వైర‌ల్, యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ ఫంగ‌ల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. అలాగే ఈ ఆకుల్లో విట‌మిన్ సి, జింక్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇవి శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా కాపాడ‌డంలో స‌హాయ‌ప‌డతాయి. ద‌గ్గు, జలుబు వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు తుల‌సి ఆకుల ర‌సంలో తేనెను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే కోరింత ద‌గ్గు, ఆస్థ‌మా, ఆయాసం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా తుల‌సి ఆకులు దోహ‌ద‌ప‌డ‌తాయి.

Holy Basil Leaves take them 4 or 5 on empty stomach for these benefits
Holy Basil Leaves

అలాగే తుల‌సి ఆకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న‌ వంటివి త‌గ్గుతాయి. అదే విధంగా ఈ ఆకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రిగిపోతుంది. ర‌క్త‌పోటు కూడా అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా తుల‌సి ఆకులు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ఇక డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు తుల‌సి ఆకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా తుల‌సి ఆకులు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. తుల‌సి ఆకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అజీర్తి, గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఆక‌లి పెరుగుతుంది. ఈ విధంగా తుల‌సి ఆకులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. రోజూ 5 నుండి 7 తుల‌సి ఆకుల‌ను ప‌ర‌గ‌డుపున న‌మిలి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చున‌ని వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

D

Recent Posts