భోజనం చేయగానే చాలా మందికి గ్యాస్ వస్తుంటుంది. ఈ క్రమంలో ఛాతిలో నొప్పి కూడా వస్తుంది. గ్యాస్ సమస్య తీవ్రంగా ఉంటే ఇలా ఛాతిలో నొప్పిగా అనిపిస్తుంది. అలాగే కడుపులో మంట, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అయితే ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే పలు పదార్థాలతోనే సహజసిద్ధంగా గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకు ఏం చేయాలంటే…
1. గ్యాస్ సమస్యను తగ్గించేందుకు కొబ్బరినీళ్లు బాగా పనిచేస్తాయి. కొబ్బరినీళ్లలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల కొబ్బరి నీళ్లను తాగుతుంటే గ్యాస్ సమస్య తగ్గుతుంది.
2. ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలను తీసుకుని ఒక కప్పు నీటిలో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం అల్పాహారం తీసుకున్న తరువాత తాగాలి. దీంతో గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
3. పసుపు ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసి దాన్ని ఒక టీస్పూన్ మోతాదులో గ్లాస్ గోరు వెచ్చని పాలలో కలిపి రాత్రి పూట తాగాలి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
4. జీర్ణ సమస్యలను తగ్గించడంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు టీస్పూన్ల అల్లం రసం సేవించాలి. లేదా భోజనానికి 15 నిమిషాల ముందు అల్లం రసం, తేనెలను కలిపి తీసుకోవాలి. దీంతో గ్యాస్ సమస్య తగ్గుతుంది.
5. ఆలుగడ్డలను జ్యూస్ చేసి భోజనానికి ముందు తీసుకోవాలి. రోజూ రెండు సార్లు ఇలా తాగితే ఫలితం ఉంటుంది.
6. భోజనం చేశాక 2-3 యాలకుల గింజలను నోట్లో వేసుకుని నమిలి మింగాలి. తరువాత నీటిని తాగాలి. గ్యాస్ సమస్య తగ్గుతుంది.
7. భోజనం చేసిన అనంతరం పుదీనా ఆకులను నేరుగా తినవచ్చు. లేదా పుదీనా డికాషన్ తాగవచ్చు. సోంపు గింజల డికాషన్ కూడా పనిచేస్తుంది. భోజనం అనంతరం ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని నమిలి మింగాలి. ఇలా చేసినా గ్యాస్ తగ్గుతుంది.
సమయానికి భోజనం చేయకపోయినా, కారం, మసాలాలు, నూనె పదార్థాలను అధికంగా తిన్నా, తగినంత నీటిని తాగకపోయినా, ఒత్తిడి, ఆందోళనలకు గురైనా గ్యాస్ సమస్య వస్తుంది. కనుక ఆయా విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365