లివర్‌, కిడ్నీలను శుభ్రం చేసే డిటాక్స్‌ డ్రింక్..!

మన శరీరంలో లివర్‌, కిడ్నీలు రెండూ ముఖ్య పాత్ర పోషిస్తాయి. మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల్లో ఉండే వ్యర్థాలను ఈ రెండు అవయవాలు బయటకు పంపుతాయి. అయితే వాటిల్లోనూ వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. అందువల్ల ఆయా అవయవాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకు గాను కింద తెలిపిన డ్రింక్‌ ఉపయోగపడుతుంది. దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

detox drink to cleanse liver and kidneys

లివర్‌, కిడ్నీ డిటాక్స్‌ డ్రింక్‌ తయారీకి కావల్సిన పదార్థాలు

  • యాపిల్‌ పండ్లు – 3
  • బీట్‌ రూట్‌ – 1
  • కొత్తిమీర – 1 కట్ట
  • పాలకూర – గుప్పెడు ఆకులు
  • కీరదోస – 1
  • నిమ్మకాయ – 11
  • టమాటాలు – 2
  • క్యారెట్లు – 3

తయారు చేసే విధానం

యాపిల్స్‌, బీట్‌రూట్‌, కొత్తిమీర, పాలకూర, కీరదోస, టమాటాలు, క్యారెట్లను బాగా కడిగి శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. అనంతరం వాటిని బ్లెండర్‌ వేసి జ్యూస్‌ తీయాలి. తరువాత ఆ జ్యూస్‌ను ఫ్రిజ్ లో పెట్టాలి. చల్లగా అయ్యాక అందులో నిమ్మరసం పిండి తాగాలి. దీంతో అనేక లాభాలు కలుగుతాయి.

పైన తెలిపిన విధంగా డిటాక్స్‌ డ్రింక్‌ను తయారు చేసి రోజూ తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. లివర్‌, కిడ్నీలు శుభ్రంగా మారుతాయి.

నిమ్మరసంతోపాటు రుచి కోసం అవసరం అనుకుంటే అందులో తేనె కలుపుకోవచ్చు. రోజూ మధ్యాహ్నం భోజనం చేశాక 1 గంట విరామం ఇచ్చి ఈ జ్యూస్‌ను తాగాలి. దీంతో ప్రయోజనం కలుగుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts