అధిక బరువు తగ్గాలంటే ఈ పండ్లను రోజూ తినాలి..!

అధిక బరువును తగ్గించుకోవడం నేటి తరుణంలో చాలా మందికి సమస్యగా మారింది. ఈ క్రమంలోనే శరీరంలోని కొవ్వును కరిగించుకునేందుకు చాలా మంది రక రకాల మార్గాలను అనుసరిస్తున్నారు. వ్యాయామం చేయడంతోపాటు పలు రకాల ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. అయితే కింద తెలిపిన పండ్లను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. మరి ఆ పండ్లు ఏమిటంటే…

eat these fruits daily to reduce over weight

1. యాపిల్‌ పండ్లలో ఫైబర్‌, ఐరన్‌లు అధికంగా ఉంటాయి. ఇవి అధిక బరువును తగ్గించేందుకు ఎంతగానో సహాయ పడతాయి. యాపిల్‌ పండ్లను తినడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది.

2. అరటి పండ్లను తినడం వల్ల చాలా మంది బరువు పెరుగుతామని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే అరటి పండ్లలో రెసిస్టెంట్‌ స్టార్చ్‌ ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడంలో, ఆకలిని నియంత్రించడంలో సహాయం చేస్తుంది. దీంతోపాటు కండరాలు నిర్మాణం అవుతాయి.

3. నిమ్మకాయ పండు కాదు. కానీ దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అధిక బరువు తగ్గుతారు. నిమ్మరసం రోజూ తాగితే లివర్‌లో ఉండే వ్యర్థాలు బయటకుపోతాయి. శరీరం ఆల్కలైజ్‌ అవుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు నిమ్మరసం ఎంతగానో ఉపయోగపడుతుంది.

4. స్ట్రాబెర్రీలు, మల్‌బెర్రీలు, ఇతర బెర్రీ పండ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే కొలెస్ట్రాల్‌, బీపీ, వాపులు తగ్గుతాయి. దీంతో అధిక బరువు తగ్గుతారు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts