Thyroid : థైరాయిడ్‌ సమస్యకు ఇంటి చిట్కాలు..!

Thyroid : మ‌న శ‌రీర ప‌నితీరుపై హార్మోన్ల ప్ర‌భావం చాలానే ఉంటుంది. ముఖ్యంగా మ‌న గొంతు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి గురించి చెప్పుకోవాలి. దాని ప‌ని తీరులో తేడాల వ‌ల్ల థైరాయిడ్ స‌మ‌స్య ఎదుర‌వుతుంది. ఇది రెండు ర‌కాలుగా ఉంటుంది. అందులో ఒక‌టి హైపో థైరాయిడిజం. ఈ రోజుల్లో దీని బారిన ప‌డే వారి సంఖ్య‌ పెరుగుతోంది. దీన్ని అదుపులో ఉంచాలంటే వైద్యులు సూచించిన మాత్ర‌ల‌తో పాటు ఆహార‌ప‌రంగానూ కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

home remedies for Thyroid
Thyroid

నీర‌సం, అల‌స‌ట‌, మాన‌సికంగా కుంగిపోవ‌డం, బ‌రువు పెర‌గ‌డం, చ‌ల్ల‌ద‌నం భ‌రించ‌లేక‌పోవ‌డం, అతి నిద్ర‌, బ‌ద్ధ‌కం, జుట్టు రాలిపోవ‌డం, చ‌ర్మం పొడిబార‌డం, కండ‌రాల నొప్పులు, ఏకాగ్ర‌త లోపించ‌డం.. వంటివి హైపో థైరాయిడిజం ల‌క్ష‌ణాలు. ఇదొక ఆటో ఇమ్యూన్ స‌మ‌స్య‌. అయొడిన్ లోపం, ఒత్తిడి, జీవ‌న విధానంలో లోపాలు వంటివి కొన్ని కార‌ణాలు. కొంత మందిలో ఇదీ కార‌ణ‌మ‌ని చెప్ప‌లేం. ఈ స‌మ‌స్య‌ను అదుపులో ఉంచాలంటే థైరాయిడ్ గ్రంథి ప‌నితీరుని ఇబ్బంది పెట్టే ప‌దార్థాల‌ను త‌గ్గించాలి. క్యాబేజి, క్యాలీప్ల‌వ‌ర్‌, పాల‌కూర‌, ముల్లంగి, సోయా బీన్స్‌, బెర్రీస్‌ను తిన‌డం త‌గ్గించాలి. యోగాసనాల్లో మ‌త్య్స‌, భుజంగ‌, బ్ర‌హ్మ‌ముద్ర‌ సింహాస‌నం, జిహా ముద్ర అలాగే ఉజ్జ‌యీ ప్రాణాయామం చేయ‌డంతో ప్ర‌యోజ‌నం కలుగుతుంది. దీంతో థైరాయిడ్‌ గ్రంథి సరిగ్గా పనిచేస్తుంది.

1. హైపో థైరాయిడిజం స‌మ‌స్య‌కు మున‌గాకు ఔషధంలా ప‌ని చేస్తుంది. మున‌గాకు ప‌ప్పు లేదా ప‌చ్చ‌డిని రోజూ తినాలి. గ్లాసు నీటిలో గుప్పెడు మున‌గాకుల్ని క‌షాయంలా కాచుకుని నిత్యం తీసుకున్నా కూడా థైరాయిడ్ ప‌నితీరు మెరుగ‌వుతుంది.

2. శొంఠి కొమ్ముల‌ను కొద్దిగా నేతిలో వేయించి చ‌ల్లారిన త‌రువాత చూర్ణంలా చేసుకోవాలి. అన్నం తినేట‌ప్పుడు మొద‌టి ముద్ద‌లో అర‌చెంచా శొంఠిపొడి, నెయ్యి క‌లిపి తినాలి. లేదా శొంఠి పొడితో క‌షాయం కాచుకోవాలి. 30 మి.లీ ప‌రిమాణంలో రోజూ తీసుకోవ‌చ్చు. దీంతో థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా పనిచేస్తుంది.

3. శుద్ధ గుగ్గుల చూర్ణం 1-2 గ్రాములు గోరు వెచ్చ‌టి నీటితో క‌లిపి తీసుకున్నా మార్పు ఉంటుంది. థైరాయిడ్‌ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

Admin

Recent Posts