Ritika Singh : టీ ష‌ర్ట్‌, షార్ట్స్ ధ‌రించి వ‌య్యారంగా న‌డుము తిప్పుతూ డ్యాన్స్ చేసిన రితికా సింగ్.. వీడియో..!

Ritika Singh : త‌మిళ స్టార్ న‌టుడు విజ‌య్‌, పూజా హెగ్డెలు జంట‌గా న‌టిస్తున్న చిత్రం.. బీస్ట్‌. ఈ సినిమాపై ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ మూవీ నుంచి ఈ మ‌ధ్యే విడుద‌లైన అరబిక్ కుతు అనే సాంగ్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం ఈ పాట‌కు డ్యాన్స్‌లు చేసి స‌ర‌దాగా ఎంజాయ్ చేశారు. ఇక ఈ జాబితాలో న‌టి రితికా సింగ్ కూడా చేరిపోయింది.

Ritika Singh danced for Arabic Kuthu song
Ritika Singh

గురు సినిమా ద్వారా ఫేమ‌స్ అయిన రితికా సింగ్‌కు ప్ర‌స్తుతం పెద్ద‌గా ఆఫ‌ర్లు లేవు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం ఈమె ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. ఇక ఈమె తాజాగా అర‌బిక్ కుతు సాంగ్‌కు డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంటుంది. హోలీ సంద‌ర్భంగా త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి రితికా సింగ్ ఈ పాట‌కు స్టెప్పులేసింది. టీ ష‌ర్టు, షార్ట్స్ ధ‌రించి ఈమె న‌డుము తిప్పుతుంటే చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌డం లేదు. అంతలా ఆక‌ట్టుకుంది.

ఇక అర‌బిక్ కుతు సాంగ్‌కు ఇప్ప‌టికే స‌మంత‌, కీర్తి సురేష్ త‌దిత‌రులు స్టెప్పులేశారు. ఈ క్ర‌మంలోనే ఆ వీడియోలు కూడా వైర‌ల్ అయ్యాయి. ఇక రితికా సింగ్ వీడియో కూడా తాజాగా వైర‌ల్ అవుతోంది.

Editor

Recent Posts