Honey And Bay Leaves : కేవలం 2 స్పూన్ల‌తో.. ఛాతి, గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే క‌ఫాన్ని ఇలా తొల‌గించుకోవ‌చ్చు..!

Honey And Bay Leaves : క‌ఫం.. మ‌న‌ల్ని వేధించే శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. ముఖ్యంగా పిల్లు మ‌రింత ఎక్కువ‌గా బాధ‌ప‌డుతుంటారు. వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడ‌ల్లా ఈ స‌మ‌స్య త‌లెత్తుతూ ఉంటుంది. క‌ఫం కార‌ణంగా ద‌గ్గు, గొంతులో ఇబ్బందిగా ఉండ‌డంతో పాటు శ్వాస తీసుకోవ‌డంలో కూడా తీవ్ర ఇబ్బంది క‌లుగుతుంది. ఈ క‌ఫం ఊపిరితిత్తుల్లో పేరుకుపోవ‌డం వ‌ల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన ఈ క‌ఫాన్ని తొల‌గించుకోవ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు.

మందులు వాడే అవ‌స‌రం లేకుండా స‌హ‌జ సిద్దంగా మ‌న వంటింట్లో ఉండే ప‌దార్థాల‌ను ఉప‌యోగించి డికాష‌న్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం ఈ క‌ఫం స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన క‌ఫాన్ని తొల‌గించే డికాష‌న్ ను ఎలా త‌యారు చేసుకోవాలి…దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి…అలాగే దీనిని ఎలా ఉప‌యోగించాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డికాష‌న్ ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం అర లీట‌ర్ నీటిని, 3 ఇంచుల అల్లం ముక్క‌ను, 6 బిర్యానీ ఆకుల‌ను, 7 ల‌వంగాల‌ను, 4 టేబుల్ స్పూన్ల తేనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో అల్లం ముక్క‌లు, బిర్యానీ ఆకుల‌ను తుంచి వేసుకోవాలి.

Honey And Bay Leaves take in this method for phlegm
Honey And Bay Leaves

త‌రువాత ఈ నీటిని 5 నిమిషాల పాటు బాగా మ‌రిగించాలి. త‌రువాత ల‌వంగాలు వేసి మ‌రో 3 నుండి 4 నిమిషాల పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత దీనిని పూర్తిగా చ‌ల్లారే వ‌ర‌కు అలాగే ఉంచాలి. త‌రువాత ఇందులో తేనె క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల డికాష‌న్ త‌యార‌వుతుంది. ఈ డికాష‌న్ ను గాజు సీసాలో పోసుకుని ఫ్రిజ్ లో ఉంచి వారం రోజుల పాటు ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇప్పుడు మ‌నం త‌యారు చేసిన ఈ డికాష‌న్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డికాష‌న్ ను పెద్ద‌లు 2 టేబుల్ స్పూన్ల మోతాదులో అలాగే పిల్లలు ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోవాలి.

ఈ డికాష‌న్ ను 2 టేబుల్ స్పూన్ల మోతాదులో గ్లాసులోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిని పోసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న నీటిని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి. ఈ విధంగా డికాష‌న్ ను త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల గొంతులో, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన క‌ఫం సుల‌భంగా తొల‌గిపోతుంది. శ్వాస తీసుకోవ‌డం వ‌ల్ల సుల‌భ‌త‌రం అవుతుంది. ఈ చిట్కాను ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు.

D

Recent Posts