Honey And Bay Leaves : కఫం.. మనల్ని వేధించే శ్వాస సంబంధిత సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఈ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా పిల్లు మరింత ఎక్కువగా బాధపడుతుంటారు. వాతావరణం మారినప్పుడల్లా ఈ సమస్య తలెత్తుతూ ఉంటుంది. కఫం కారణంగా దగ్గు, గొంతులో ఇబ్బందిగా ఉండడంతో పాటు శ్వాస తీసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఈ కఫం ఊపిరితిత్తుల్లో పేరుకుపోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన ఈ కఫాన్ని తొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
మందులు వాడే అవసరం లేకుండా సహజ సిద్దంగా మన వంటింట్లో ఉండే పదార్థాలను ఉపయోగించి డికాషన్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం ఈ కఫం సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని తొలగించే డికాషన్ ను ఎలా తయారు చేసుకోవాలి…దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…అలాగే దీనిని ఎలా ఉపయోగించాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డికాషన్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం అర లీటర్ నీటిని, 3 ఇంచుల అల్లం ముక్కను, 6 బిర్యానీ ఆకులను, 7 లవంగాలను, 4 టేబుల్ స్పూన్ల తేనెను ఉపయోగించాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో అల్లం ముక్కలు, బిర్యానీ ఆకులను తుంచి వేసుకోవాలి.
తరువాత ఈ నీటిని 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తరువాత లవంగాలు వేసి మరో 3 నుండి 4 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని పూర్తిగా చల్లారే వరకు అలాగే ఉంచాలి. తరువాత ఇందులో తేనె కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల డికాషన్ తయారవుతుంది. ఈ డికాషన్ ను గాజు సీసాలో పోసుకుని ఫ్రిజ్ లో ఉంచి వారం రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసిన ఈ డికాషన్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డికాషన్ ను పెద్దలు 2 టేబుల్ స్పూన్ల మోతాదులో అలాగే పిల్లలు ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోవాలి.
ఈ డికాషన్ ను 2 టేబుల్ స్పూన్ల మోతాదులో గ్లాసులోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక కప్పు గోరు వెచ్చని నీటిని పోసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా డికాషన్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల గొంతులో, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం సులభంగా తొలగిపోతుంది. శ్వాస తీసుకోవడం వల్ల సులభతరం అవుతుంది. ఈ చిట్కాను ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.