చిట్కాలు

Turmeric Tea For Over Weight : డైట్, ఎక్స‌ర్‌సైజ్ చేయాల్సిన ప‌నిలేదు.. దీన్ని తాగితే చాలు.. కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..

Turmeric Tea For Over Weight : పసుపు భారతీయుల ప్రతి కిచెన్‌లో ఉండే ముఖ్యమైన పదార్ధం. వంటింట్లో తప్పకుండా లభించేది పసుపును పాల నుంచి మొదలుకుని కూరల వరకూ అన్నింట్లో ఉపయోగిస్తుంటారు. పసుపు వల్ల కూరలకు రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుతుంది. అదే సమయంలో పసుపుతో బరువు కూడా తగ్గవచ్చని చాలా మందికి తెలియదు. పసుపు కేవలం వంటలకు రుచి కోసమే కాకుండా బరువు తగ్గేందుకు కూడా ఉపయోగించవచ్చు. పసుపుతో ఎలా బరువు తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గించుకోవడం కోసం పసుపుతో ఒక అద్భుతమైన డ్రింక్ ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం 1/2 టేబుల్ స్పూన్ల పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1/2 టేబుల్ స్పూన్ శొంఠి పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడితో ఒక కప్పులో వేసుకోండి. ఆ తరువాత దానిలో ఒక కప్పు వేడి నీటిని పోసి బాగా కలిపి 5 నిమిషాలు మూతపెట్టి ఉంచండి.

how to reduce your weight without gym or exercise

త్రాగే ముందు ఒకసారి బాగా కలుపుకొని తాగండి. ఎందుకంటే కొద్దిగా మిగిలిన పొడి అడుగున చేరుతుంది. ఈ డ్రింక్ ను ఉదయం పరగడుపున ఖాళీ కడుపుతో తీసుకోండి. ఇంకా మంచి రిజల్ట్స్ కావాలనుకుంటే రాత్రి పడుకునే ముందు కూడా ఒక కప్పు తీసుకోండి. ఈ డ్రింక్ తాగిన తర్వాత 30 నుండి 45 నిమిషాలు ఏమీ తినకండి. ఇలా 15 రోజులు చేయడం వలన బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా, శరీరంలోని అనేక సమస్యలను నయం చేస్తుంది.

అది ఎలా అంటే పసుపు టీ ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. గ్యాస్, ఉబ్బరం సమస్యలకు ఉపశమనం అందిస్తుంది. అందుకే ఆయుర్వేదంలో పసుపుకు గొప్ప ఔషధంగా హోదాను ఇచ్చారు. ఇది హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. అంతేకాకుండా పిసిఓడి సమస్యను తగ్గిస్తుంది థైరాయిడ్, కొలెస్ట్రాల్, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మేలు చేస్తుంది. మోకాళ్ల సమస్యలతో బాధపడేవారు అంటే ఆర్థరైటిస్‌తో బాధపడేవారు కూడా పసుపు టీ తాగొచ్చు. పసుపు టీ తాగడం వలన నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా పాలు ఇచ్చే తల్లులు కూడా పసుపు టీ తాగడం వల్ల గర్భధారణ సమయంలో ఏర్పడిన అధిక నీటి శాతాన్ని తగ్గిస్తుంది.

Admin

Recent Posts