హెల్త్ టిప్స్

Drinking Water : నీళ్ల‌ను ఎల్ల‌ప్పుడూ కూర్చునే తాగాలి.. నిల‌బ‌డి తాగ‌కూడ‌దు..!

Drinking Water : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. మన ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా మనం పొందవచ్చు. ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంలో, మనం పాటించే జీవనశైలిలో ఉంది. మంచి నిద్ర, ఎక్కువ నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అన్ని శరీరవ్యవస్థలు సజావుగా పనిచేయడానికి హైడ్రేట్ గా ఉండడం చాలా ముఖ్యం. ఎలా అయితే మనం పోషకాహారాన్ని తీసుకుంటున్నామో, అలాగే నీళ్లు కూడా మనకి చాలా ముఖ్యం.

ప్రతిరోజు 8 నుండి 10 గ్లాసుల వరకు నీళ్లు తాగాల‌ని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. సరిపడా నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. నీళ్లు ఎంత తాగామనేది ఎలా ముఖ్యమో, ఎలా తాగామనేది కూడా అంతే ముఖ్యం. నీటిని తాగేటప్పుడు మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. దాని వలన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నీళ్లు తాగేటప్పుడు ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పులని చేయకండి. నిలబడి అస్సలు నీళ్లు తాగకూడదు.

we should drink water by sitting only

నిలబడి నీళ్లు తాగితే నరాలలో టెన్షన్ ఏర్పడుతుంది. అజీర్తి కలుగుతుంది. ఆయుర్వేదం కూడా నిలబడి నీళ్లు తాగడం మంచిది కాదని అంటోంది. కాబట్టి ఎప్పుడూ నిలబడి తాగకండి. చాలా మంది దాహంగా ఉందని స్పీడ్ గా తాగేస్తూ ఉంటారు. ఇలా తాగడం వలన మూత్రపిండాల‌లో, మూత్రాశయంలో సమస్యలు వస్తాయి. జీర్ణక్రియ కోసం కొంచెం కొంచెంగా నీళ్లు తాగాలి. చాలామంది ఎక్కువగా నీళ్లు తాగేస్తూ ఉంటారు.

అద‌నంగా నీళ్ల‌ను తాగడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఎలాంటి ఆధారాలు కూడా లేవు. ఎక్కువ నీళ్లు తాగితే నీటి మత్తు సమస్య వస్తుంది. సోడియం స్థాయిలలో మార్పు, మెదడు వాపు, మూర్ఛ ఇలా పలు సమస్య కలుగుతూ ఉంటాయి. భోజనానికి ముందు అసలు నీళ్లు తాగకూడదు. భోజనానికి ముందు నీళ్లు తాగడం వలన జీర్ణక్రియ దెబ్బతింటుంది. వికారం, మలబద్ధకం వస్తాయి. అతిగా నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని గుర్తు పెట్టుకోండి. ఈ పొరపాట్లు చేయకుండా నీళ్లు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.

Admin

Recent Posts