Lemon For Knee Pain : మానవ శరీరంలో మోకాళ్లనేవి నిస్సందేహంగా అత్యంత ముఖ్యమైనవి. నడవడం, నిలబడడం, పరిగెత్తడం వంటి శరీర భంగిమలకు కాళ్ల కదలికలు మోకాళ్లు ఎంతో అవసరం. ఒక్కసారి గనుక మోకాళ్ల నొప్పుల సమస్య తలెత్తితే ఒక అంతే సంగతులు. పెద్దవారే కాకుండా యుక్త వయసు వారు కూడా ప్రస్తుత కాలంలో ఈ మోకాళ్ల నొప్పుల బారిన పడుతున్నారు. మారిన జీవన విధానం, పోషకాహార లోపం, అధిక బరువు, వయసు మీద పడడం వంటి అనేక కారణాల చేత మోకాళ్ల నొప్పుల సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య నుండి బయట పడడానిక పెయిన్ కిల్లర్ లను, ఆయింట్ మెంట్ లను, నొప్పిని తగ్గించే స్ప్రే లను వాడుతుంటారు. పెయిన్ కిల్లర్ లను వాడడం వల్ల ఉపశమనం కలిగినప్పటికి వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఒకే ఒక ఇంటి చిట్కాను ఉపయోగించి మనం చాలా సులభంగా ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా మనం ఈ మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. మోకాళ్ల నొప్పులను తగ్గించే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో నిమ్మకాయ మరియు నువ్వుల నూనె ఎంతగానో ఉపయోగపడతాయి. నిమ్మకాయలు మన వంటింట్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికి తెలుసు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, బరువు తగ్గడంలో, శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపించడంలో నిమ్మకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే పోషకాలు నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. అదే విధంగా నువ్వులను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. నువ్వులల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది.
వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. అంతేకాకుండా నువ్వులు యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. శరీరంలో నొప్పులను తగ్గించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. నువ్వులను, నిమ్మకాయను ఏవిధంగా ఉపయోగించడం వల్ల మనం మోకాళ్ల నొప్పుల నుండి బయట పడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ముందుగా ఒక నిమ్మకాయను తీసుకుని రెండు ముక్కలుగా చేయాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కను తీసుకుని గోరు వెచ్చని నువ్వుల నూనెలో ముంచి మోకాళ్లపై రుద్దాలి. నిమ్మకాయ రసం అలాగే నువ్వుల నూనె చర్మంలోకి ఇంకేలా 5 నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.