Loose Motions : లూజ్ మోష‌న్స్ త‌గ్గాలంటే.. దీంతో ఇలా చేయండి..!

Loose Motions : నీళ్ల విరోచనాలు.. మ‌న‌ల్ని వేధించే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఎప్పుడోక‌ప్పుడు ఏదో ఒక సంద‌ర్భంలో ప్ర‌తి ఒక్క‌రు ఈ స‌మ‌స్య బారిన ప‌డుతూ ఉంటారు. నీళ్ల విరోచ‌నాల స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఆహారం విష‌తుల్యం అయిన‌ప్పుడు, కొన్ని ర‌కాల మందుల‌ను వాడిన‌ప్పుడు, అల‌ర్జీని క‌లిగించే ఆహారాన్ని తీసుకున్న‌ప్పుడు, వైర‌స్ మ‌రియు బ్యాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ ల బారిన‌ప్పుడు, క‌లుషిత‌మైన నీటిని తాగిన‌ప్పుడు నీళ్ల విరోచ‌నాల స‌మ‌స్య త‌లెత్తుతుంది. సాధార‌ణంగా ఈ స‌మ్య ఒక‌రి నుండి మ‌రొక‌రికి వ్యాపించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే ఈ స‌మ‌స్య నుండి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాలి. ఈ స‌మ‌స్య తీవ్ర‌మ‌య్యే కొద్ది డీహైడ్రేష‌న్, క‌డుపు నొప్పి, నీర‌సం, క‌ళ్లు తిర‌గ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

క‌నుక ఈ స‌మ‌స్య నుండి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాలి. చాలా మంది ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌డానికి మందుల‌ను వాడుతూ ఉంటారు. కానీ మందులు వాడే అవ‌సరం లేకుండా చ‌క్క‌టి ఇంటి చిట్కాను ఉప‌యోగించి కూడా మ‌నం నీళ్ల విరోచ‌నాల స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల స‌త్వ‌ర ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. నీళ్ల విరోచ‌నాల‌ను త‌గ్గించే ఇంటి చిట్కా ఏమిటి..అన్న అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా మ‌నం ఒక టీ స్పూన్ గ‌స‌గ‌సాల‌ను, ఒక టీ స్పూన్ కండ‌చ‌క్కెర పొడిని, రెండు టీ స్పూన్ల ఆవు నెయ్యిని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా గ‌స‌గ‌సాల‌ను, కండ‌చక్కెర‌ను క‌లిపి మెత్త‌గా నూరాలి. త‌రువాత క‌ళాయిలో ఆవు నెయ్యి వేసి వేడి చేయాలి.

Loose Motions home remedy do like this
Loose Motions

నెయ్యివేడ‌య్యాక గ‌స‌గ‌సాల మిశ్ర‌మాన్ని వేసి క‌ల‌పాలి. దీనిని చిన్న మంట‌పై కండ చెక్క క‌రిగి రంగు మారే వ‌ర‌కు అన‌గా క్యార‌మెల్ లాగా అయ్యే వ‌ర‌కు క‌లుపుతూ వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ప్లేట్ లోకి తీసుకుని చ‌ల్లార‌నివ్వాలి. గ‌స‌గ‌సాల మిశ్ర‌మం చ‌ల్లారిన త‌రువాత దీనిని నోట్లో వేసుకుని న‌ములుతూ మింగాలి. ఇలా చేయ‌డం వల్ల నీళ్ల విరోచ‌నాలు 20 నిమిషాల నుండి అర‌గంట వ్య‌వ‌ధిలోనే త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల నీళ్ల విరోచ‌నాల స‌మ‌స్య నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

D

Recent Posts