Narala Noppi : న‌రాల బ‌ల‌హీన‌త‌, న‌రాల నొప్పికి అద్భుత‌మైన చిట్కాలు..!

Narala Noppi : ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువ ప్ర‌దేశంలో కూర్చొని ప‌ని చేయ‌డం వ‌ల్ల కానీ, మారిన జీవ‌న విధానం వ‌ల్ల అలాగే ఆహార‌పు అల‌వాట్ల కానీ ఇలా ఎన్నో ర‌కాల కార‌ణాల‌తో చాలా మంది న‌రాల బల‌హీన‌త స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. దీంతో ఎవ‌రి ప‌ని వారు చేసుకోలేక అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. న‌రాల బ‌ల‌హీన‌త కార‌ణంగా మ‌న శ‌రీరంలో ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తే అవ‌కాశం ఉంది. ఈ న‌రాలు శ‌రీరంలో ఏ ప్రదేశంలోనైనా బ‌ల‌హీన‌ప‌డ‌వ‌చ్చు. ఇలా న‌రాలు బ‌ల‌హీన‌ప‌డ‌డం వ‌ల్ల వాటిపై ఒత్తిడి ప‌డి అవి దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. క‌నుక ఈ న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య‌ను అస‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య తలెత్తిన వెంట‌నే దానిని గుర్తించి త‌గిన జాగ్ర‌త్తలు తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం.

ఎటువంటి మందులు వాడే అవ‌స‌రం లేకుండా స‌హ‌జ సిద్దంగా మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌ను ఉప‌యోగించి మ‌నం ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించే రెండు ఇంటి చిట్కాల‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాల‌ను వాడడం వ‌ల్ల న‌రాల బ‌ల‌హీన‌త త‌గ్గ‌డంతో పాటు న‌రాల‌పై ఒత్తిడి, అడ్డంకులు కూడా తొల‌గిపోతాయి. న‌రాల బ‌లహీన‌త‌ను త‌గ్గించే మొద‌టి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మ‌నం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాల‌ను తీసుకుని అందులో అర టీ స్పూన్ ప‌సుపును వేసి చిన్న మంట‌పై పొంగు వ‌చ్చే వ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత ఈ పాల‌ను ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ పాలు గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత దీనిలో రుచి కొర‌కు ఒక టీస్పూన్ తేనెను వేసి క‌లుపుకుని తాగాలి. ఈ పాల‌ను తాగ‌డం వ‌ల్ల న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య త‌గ్గ‌డంతో పాటు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి.

Narala Noppi home remedies in telugu
Narala Noppi

అలాగే న‌రాల బ‌ల‌హీన‌త‌ను త‌గ్గించే మ‌రో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ కొబ్బ‌రి నూనెను తీసుకోవాలి. త‌రువాత ఇందులో 7 నుండి 8 చుక్క‌ల పుదీనా నూనెను వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని న‌రాల నొప్పుల‌పై రాసి 8 నుండి10 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేయాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేయ‌డం వ‌ల్ల న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య త‌గ్గడంతో పాటు న‌రాల ఒత్తిడి అలాగే న‌రాల్లో ఉన్న అడ్డంకులు తొల‌గిపోతాయి. ఇలా త‌యారు చేసుకున్న పాల‌ను ప్ర‌తిరోజూ ఒక‌సారి తాగుతూ ఇలా నూనెతో మ‌ర్ద‌నా చేసుకోవ‌డం వ‌ల్ల న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

D

Recent Posts