Pippi Pannu : ప్రస్తుత తరుణంలో మనలో చాలా మంది పిప్పి పన్ను సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి అంతా ఇంతా కాదు. కొన్నిసార్లు పిప్పి పన్ను నొప్పిని, వాపును కూడా కలిగి ఉంటుంది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేక చాలా మంది ఈ పన్నును తొలగింపజేసుకుంటారు. ఇలా చేయడం వల్ల దాని పక్కన ఉండే దంతాలు కూడా బలాన్ని కోల్పోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆయుర్వేదం ద్వారా ఈ పిప్పి పన్ను సమస్యను ఏవిధంగా నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వెంపలి చెట్టును ఉపయోగించి మనం ఈ సమస్య నుండి బయట పడవచ్చు. వెంపలి చెట్టును ఆయుర్వేదంలో ఎన్నో రకాల రోగాలను నయం చేయడంలో ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. వెంపలి చెట్టు పూలు చిన్నగా ఎరుపు రంగులో ఉంటాయి. ఈ చెట్టు కాయలు పెసర కాయల లాగా ఉంటాయి.
పిప్పి పన్ను సమస్య నుండి బయటపడడానికి వెంపలి చెట్టును ఏవిధంగా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వెంపలి చెట్టు వేరును ఉపయోగించి మనం పిప్పి పన్ను నొప్పిని తగ్గించుకోవచ్చు. వెంపలి చెట్టు వేరును సేకరించి దానికి ఒక లవంగాన్ని, ఒక మిరియాన్ని కలిపి మెత్తగా దంచి ఆ మిశ్రమాన్ని పిప్పి పన్ను పై అర గంట పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి వెంటనే తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా రోజూ చేయడం వల్ల ఈ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు. దీంతో దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి సమస్యలు కూడా తగ్గుతాయి.