Pomegranate For Piles : మారిన మన జీవన విధానం కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల్లో మొలల సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉంటారు. స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. మలబద్దకం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, నీటిని తాగకపోవడం, ఎక్కువగా కూర్చుని పనిచేయడం, అధిక బరువు, మసాలాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం, వేడి చేసే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. మొలల కారణంగా మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. అలాగే కొన్ని సార్లు రక్తస్రావం కూడా జరిగే అవకాశం ఉంది. ఎంతగానో వేధించే ఈ మొలల సమస్యను మనం కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి చాలా సులభంగా నయం చేసుకోవచ్చు.
మొలల సమస్యను తగ్గించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొలల సమస్యతో బాధపడే వారు రోజూ రెండు పూటలా అర కప్పు మోతాదులో ముల్లంగి రసాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల క్రమంగా మొలల సమస్య తగ్గుతుంది. అలాగే రోజూ రాత్రిపడుకునే ముందు 4 ఎండు అంజీరాలను నీటిలో నానబెట్టాలి. ఈ అంజీరాలను నానబెట్టిన నీటితో పాటు అంజీరాలను కూడా పూటకు రెండు చొప్పున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మలబద్దకం సమస్యతో పాటు మొలల సమస్య కూడా తగ్గుతుంది. అలాగే దానిమ్మ తొక్కను నీటిలో వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి రోజుకు రెండు సార్లు తాగాలి. అలాగే మజ్జిగలో రాళ్ల ఉప్పు, మిరియాల పొడి, అల్లం వేసి రోజుకు రెండు సార్లు తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
మొలల నుండి రక్తం కారే సమస్యతో బాధపడే వారు ఒక టీ స్పూన్ ఆవాల పిండిని అర కప్పు మేకపాలల్లో వేసి కలపాలి.అలాగే ఇందులో కొద్దిగా పంచదారును వేసుకుని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల క్రమంగా మొలల నుండి రక్తం కారడం తగ్గడంతో పాటు మొలల సమస్య కూడా తగ్గుతుంది. అలాగే ఒక టీ స్పూన్ అల్లానికి కొద్దిగా నిమ్మరసం, పుదీనా ఆకులు, తేనె కలిపి రోజుకు మూడు నుండి నాలుగు సార్లు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొలల సమస్య తగ్గు ముఖం పడుతుంది. అలాగే బాగా పండిన అరటి పండును కప్పు పాలల్లో వేసి కలిపి తాగాలి. ఇలా తాగడం వల్ల మొలల వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది. అలాగే మొలల సమస్యతో బాధపడే వారు నేరేడు పండ్లను తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
అదే విధంగా రోజూ ఒక తాజా పసుపు కొమ్మును తినడం వల్ల కూడా మొలల సమస్య తగ్గుతుంది. మొలల సమస్యతో బాధపడే వారు వాటిపై కొద్దిగా కొబ్బరి నూనెను రాసుకోవడం వల్ల ఆ భాగంలో కలిగే మంట, దురద వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఉల్లిపాయ తురుముకు తేనెను కలిపి రోజుకు రెండు నుండి మూడుసార్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కూడా మొలల సమస్య తగ్గుతుంది. ఈ విధంగా మొలల సమస్యతో బాధపడే వారు ఈ ఇంటి చిట్కాలను వాడడం వల్ల మొలల సమస్య నుండి చక్కటి ఉపశమనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సమస్య మరీ తీవ్రంగా ఉన్నవారు వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమమని వారు చెబుతున్నారు.