Ranapala For Kidney Stones : మనలో చాలా మంది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, నీటిని తక్కువగా తాగడం, అధిక బరువు, ఉప్పు మరియు పంచదార కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడడం వంటి కారణాల చేత మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తలెత్తుతుంది. మూత్రపిండాల్లో రాళ్ల కారణంగా కడుపులో నొప్పి, మూత్రంలో రక్తం రావడం, మూత్రవిసర్జన సమయంలో తీవ్రమైన బాధకలగడం, జ్వరం, మూత్రంలో మంట, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లడం ఇలా ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
సాధారణంగా ఈ సమస్య నుండి బయటపడడానికి వైద్యులు శస్త్రచికిత్సను, మందులను సూచిస్తూ ఉంటారు. ఇవేకాకుండా ఆయుర్వేదం ద్వారా కూడా మనం మూత్రపిండాల్లో రాళ్లను తొలగించుకోవచ్చు. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు అలాగే ఈ సమస్య మరింత తీవ్రతరం కాకూడదు అనుకునే వారు రణపాలాకును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుదని నిపుణులు చెబుతున్నారు. రణపాలాకులో ఫైటో కెమికల్స్ తో పాటు 12 రకాల ఇతర రసాయన సమ్మేళనాలు ఉంటాయి. సాధారణంగా మూత్రపిండాల్లో పేరుకుపోయిన క్యాల్షియం, ఆక్సలైట్స్ తో కలిసి రాళ్లలాగా మారతాయి.
రణపాలాకును తీసుకోవడం వల్ల వీటిలో ఉండే రసాయన సమ్మేళనాలు క్యాల్షియం మరియు ఆక్సలైట్స్ కలవకుండా చేసి రాళ్లు ఏర్పడకుండా నిరోదించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే రాళ్ల కణాల దెబ్బతిన్న కణజాలాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంలో కూడా రణపాల ఆకు దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాలల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు 4 రణపాలాకులను తీసుకుని 200 ఎమ్ ఎల్ నీటిలో వేసి 100 ఎమ్ ఎల్ అయ్యే వరకు మరిగించాలి. తరువాత ఈ కషాయాన్ని వడకట్టి తేనె కలిపి తీసుకోవాలి. అలాగే ఈ ఆకులను నేరుగా నమిలి తినవచ్చు. ఈ విధంగా రణపాలాకును తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.