Pumpkin Curry : బెల్లం గుమ్మ‌డికాయ కూర‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Pumpkin Curry : గుమ్మ‌డికాయ‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. గుమ్మ‌డికాయ‌లో మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. గుమ్మ‌డి కాయ‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఎక్కువ‌గా గుమ్మ‌డికాయ‌ను సాంబార్ త‌యారీలో వాడుతూ ఉంటారు. అలాగే ఈ గుమ్మ‌డికాయ‌తో బెల్లం క‌లిపి క‌మ్మ‌టి కూర‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటారు. ఇలా బెల్లం క‌లిపి చేసే గుమ్మ‌డికాయ కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ కూర‌ను ఇష్టంగా తింటారు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. తియ్య‌గా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ బెల్లం గుమ్మ‌డికాయ కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం గుమ్మ‌డికాయ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గుమ్మ‌డికాయ – కిలో, బెల్లం – అర‌కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 3, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు -ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, కారం – చిటికెడు, ఉప్పు – అర టీ స్పూన్.

Pumpkin Curry recipe in telugu make in this method
Pumpkin Curry

బెల్లం గుమ్మ‌డికాయ కూర త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఎండుమిర్చి, జీల‌క‌ర్ర‌, ఆవాలు, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత గుమ్మ‌డికాయ ముక్క‌లు, ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత బెల్లం వేసి మూత పెట్టి మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత అంతా క‌లిసేలా క‌లుపుకుని మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత మూత తీసి 10 నిమిషాల పాటు ఉడికించాలి. నీరంతా పోయి కూర ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. దీనిని వేడి వేడిగా ఇలాగే సర్వ్ చేసుకోవ‌చ్చు. లేదంటే చ‌ల్లారిన త‌రువాత కూడా స‌ర్వ్ చేసుకోవ‌చ్చు. దీనిని నేరుగా ఇలాగే తిన‌వ‌చ్చు. అలాగే చ‌పాతీ, పూరీ వంటి వాటితో తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts