Sonthi For Knee Pains : ఒక చక్కటి చిట్కాను ఉపయోగించి మనం శరీరంలో ఉండే నొప్పులన్నింటిని తగ్గించుకోవచ్చు. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, మెడ నొప్పి ఇలా అనేక రకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. మన శరీరంలో వాతం ఎక్కువైనప్పుడు శరీరంలో మలినాలు, వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోతాయి. ఇవి మన కీళ్ల మధ్యలో పేరుకుపోయి కీళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. అలాగే కీళ్ల నుండి శబ్దం రావడం జరుగుతుంది. కీళ్లు బలహీనంగా మారిపోతాయి. దీంతో ముందుగా మన చేత్తుల్లో నొప్పులు వస్తూ ఉంటాయి. క్రమంగా ఈ నొప్పులు పెరిగి మనం నడవలేని స్థితికి చేరుకుంటాము. కనుక నొప్పులు ప్రారంభ దశలో ఉన్నప్పుడే వీటిని నివారించుకోవడం మంచిది.
మనం చక్కటి చిట్కాను వాడడం వల్ల వాతం దోషం వల్ల వచ్చే నొప్పులన్నింటిని తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల గౌట్, ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పులన్నీ తగ్గుతాయి. ఈ చిట్కాను తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా సులభం. అదే విధంగా ఈ చిట్కా పూర్తిగా సహజ సిద్దమైనది. దీనిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. కీళ్ల నొప్పులను తగ్గించే చిట్కా ఏమిటి.. దీనిని ఎలా వాడాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను వాడడానికి గానూ మనం 50 గ్రాముల శొంఠిని, 50 గ్రాముల మెంతులను, 50 గ్రాముల వామును తీసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని ఒక జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ మోతాదులో వేసి కలపాలి.
తరువాత ఇందులో ఒక టీ స్పూన్ బెల్లం పొడిని వేసి కలపాలి. అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు బెల్లాన్ని తీసుకోకపోవడమే మంచిది. ఇలా తయారు చేసుకున్న నీటిని తాగిన అరగంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ విధంగా ఈ చిట్కాను క్రమం తప్పకుండా 15 రోజుల పాటు పాటించడం వల్ల మన శరీరంలో ఉన్న వాత దోషాలన్న తొలగిపోతాయి. కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు తగ్గు ముఖం పడతాయి. అంతేకాకుండా ఈ చిట్కాను వాడడం వల్ల కఫ సమస్యలు తొలగిపోతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యి అందులో ఉండే పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయి. వాతం వల్ల వచ్చే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల నొప్పుల నుండి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు.