Gobi Tomato Masala Curry : కాలిఫ్ల‌వ‌ర్‌, ట‌మాటాల‌ను క‌లిపి మ‌సాలా క‌ర్రీని ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి బాగుంటుంది..!

Gobi Tomato Masala Curry : మ‌నం క్యాలీప్ల‌వ‌ర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసే రుచికర‌మైన వంట‌కాల్లో క్యాలీప్ల‌వ‌ర్ ట‌మాట కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఈ క్యాలీప్ల‌వ‌ర్ ట‌మాట కూర‌ను మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌సాలా పేస్ట్ వేసి చేసే ఈ కూర మ‌రింత రుచిగా ఉంటుంది. అలాగే దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. మ‌రింత రుచిగా మసాలాలు వేసి క్యాలీప్ల‌వ‌ర్ ట‌మాట కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గోబి ట‌మాట మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన క్యాలీప్ల‌వ‌ర్ – అర‌కిలో, ట‌మాటాలు – 5, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ప‌సుపు -పావు టీ స్పూన్, కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Gobi Tomato Masala Curry recipe in telugu make in this way
Gobi Tomato Masala Curry

మ‌సాలా దినుసులు..

ప‌చ్చికొబ్బరి ముక్క‌లు – 3 టేబుల్ స్పూన్స్, అల్లం – 2 ఇంచుల ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, యాల‌కులు – 3, ల‌వంగాలు – 3, జీడిప‌ప్పు – 10, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌.

గోబి ట‌మాట మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ట‌మాటాలను జార్ లో వేసి ఫ్యూరీలాగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే మసాలా దినుసుల‌ను కూడా జార్ లో వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క్యాలీప్ల‌వ‌ర్ ను నీటిలో వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత క్యాలీప్ల‌వ‌ర్ ను వ‌డ‌క‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ట‌మాట ఫ్యూరీ, మ‌సాలా పేస్ట్, ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి.

దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉడికించిన క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు, ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కొత్తిమీర వేసి క‌లపాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోబి ట‌మాట మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే క్యాలీప్ల‌వ‌ర్ ట‌మాట కంటే ఈ విధంగా త‌యారు చేసిన కూర మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts