Belly Fat Loss : పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు మొత్తం క‌రిగి ఫ్లాట్‌గా మారాలంటే.. దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే తీసుకోండి..!

Belly Fat Loss : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది పొట్ట ద‌గ్గ‌ర అధికంగా కొవ్వు చేరి బాధ‌ప‌డుతున్నారు. పొట్ట‌ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకునేందుకు అనేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఇందుకు గాను క‌ఠిన‌మైన వ్యాయామాలు చేస్తూ.. డైట్‌ను పాటిస్తున్నారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకోవ‌డం తేలికే అని చెప్ప‌వ‌చ్చు. అందుకు గాను కింద తెలిపిన చిట్కాను పాటించాల్సి ఉంటుంది. అదేమిటంటే..

take this mixture on empty stomach for Belly Fat Loss
Belly Fat Loss

త్రిఫ‌ల చూర్ణం గురించి చాలా మందికి తెలుసు. ఆయుర్వేదంలో దీనికి ఎంత‌గానో ప్రాధాన్య‌త ఉంది. దీన్ని అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లను త‌గ్గించుకునేందుకు ఉప‌యోగిస్తారు. అయితే త్రిఫ‌ల చూర్ణంతో పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును సుల‌భంగా క‌రిగించుకోవ‌చ్చు. కానీ దీన్ని ఎలా వాడాలి ? అనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక టీస్పూన్ త్రిఫ‌ల చూర్ణాన్ని ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా క‌లిపి అలాగే ఉంచాలి. ఒక గంట సేపు నాన‌బెట్టిన త‌రువాత‌.. ఆ నీటిని అలాగే మ‌రిగించాలి. స‌న్న‌ని మంట‌పై 5 నిమిషాల పాటు మ‌రిగించి అనంత‌రం ఆ నీటిని వ‌డ‌క‌ట్టి తాగేయాలి. ఇలా రోజూ ప‌ర‌గ‌డుపునే తాగాల్సి ఉంటుంది. త‌రువాత 30 నిమిషాల వ‌ర‌కు ఏమీ తీసుకోకూడ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌రిగిపోతుంది.

త్రిఫ‌ల చూర్ణాన్ని ఈ విధంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని వ్య‌ర్థాలు అన్నీ బ‌య‌ట‌కు పోతాయి. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. అలాగే శ‌రీరంలో ఉన్న మొండి కొవ్వు సైతం క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు మొత్తం క‌రిగి ఫ్లాట్‌గా మారుతుంది. అయితే ఈ విధంగా త్రిఫ‌ల చూర్ణాన్ని తాగితే కొంద‌రిలో విరేచ‌నాలు కావ‌చ్చు. క‌నుక అలాంటి వారు దీన్ని రాత్రి నిద్ర‌కు ముందు తీసుకుంటే మంచిది. లేదా త్రిఫ‌ల చూర్ణం ఒక టీస్పూన్‌ను ఒక గ్లాస్ మ‌జ్జిగ‌లో క‌లిపి తాగాలి. దీంతో ప్ర‌భావ‌వంతంగా ప‌నిచేస్తుంది. అనుకున్న ఫ‌లితం వ‌స్తుంది.

Admin

Recent Posts