IPL 2022 : మరికొద్ది గంటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే జట్లన్నీ టోర్నీ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ సారి రెండు కొత్త టీమ్‌లు చేరడంతో మరిన్ని మ్యాచ్‌లను ఆడనున్నారు. లక్నో సూపర్ జియాంట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈ సారి కొత్తగా ఐపీఎల్‌లో ఆడుతున్నాయి. దీంతో ఈసారి ఐపీఎల్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక శనివారం తొలి మ్యాచ్ చెన్నై, కోల్‌కతా జట్ల మధ్య జరగనుంది.
కాగా ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇస్తున్న స్టేడియంలలో ఒకటైన ముంబైలోని వాంఖెడె స్టేడియంలో చెన్నై, బెంగళూరు జట్లు శుక్రవారం సాయంత్రం ప్రాక్టీస్ చేశాయి. ఈ క్రమంలోనే ధోనీ, విరాట్ కోహ్లిలు ఒకరికొకరు ఎదురయ్యారు. వారిద్దరూ ఒకరినొకరు కలుసుకుని ఆలింగనం చేసుకున్నారు. ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ గా మారింది. వారు అలా హగ్ చేసుకోవడాన్ని ఫ్యాన్స్ ఆస్వాదిస్తున్నారు. చూసేందుకు రెండు కనులు చాలడం లేదని.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈసారి చెన్నై టీమ్‌కు ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం లేదు. కెప్టెన్‌గా తప్పుకున్నాడు. దీంతో అతని స్థానంలో రవీంద్ర జడేజా ఈ సారి చెన్నై జట్టును నడిపించనున్నాడు. ఇక బెంగళూరు కెప్టెన్‌గా కూడా ఇదివరకే కోహ్లి తప్పుకున్నాడు. అతని స్థానంలో డుప్లెసిస్ ఈసారి కెప్టెన్‌గా పనిచేయనున్నాడు. ఇక బెంగళూరు జట్టు తన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 27వ తేదీన జరగనుంది.