Backpain : మారిన జీవన విధానం మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు. వాటిల్లో కీళ్ల నొప్పులు కూడా ఒకటి. పూర్వకాలంలో వయసు పైబడిన వారిలో మాత్రమే మనం ఈ సమస్యను చూసేవారం. కానీ ప్రస్తుత కాలంలో కదలకుండా కూర్చొని చేసే ఉద్యోగాలకే యువత ప్రాధాన్యతను ఇస్తోంది. దీంతో ఒకే చోట కదలకుండా ఎక్కువ సేపు కూర్చొవడం వల్ల నడుమునొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు తలెతుత్తున్నాయి. అంతేకాకుండా తగినంత వ్యాయామం, శారీరక శ్రమ, అధిక బరువు వంటి ఇతర కారణాల చేత మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వస్తున్నాయి.
ఈ సమస్యల కారణంగా మనం ఎక్కువ సేపు కూర్చోలేము, నడవలేము అలాగే ఒక్కోసారి మన పని కూడా మనం చేసుకోలేకపోతుంటాము. ఈ కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని పొందడానికి చాలా మంది పెయిన్ కిల్లర్ లను వాడుతూ ఉంటారు. అలాగే మార్కెట్ లో దొరికే రకరకాల ఆయింట్ మెంట్లను వాడుతూ ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేక నొప్పులు తగ్గక ఇబ్బంది పడేవారు కూడా ఉన్నారు. మన వంటింట్లో ఉండే పదార్థాలతో పొడిని తయారు చేసుకుని వాడడం వల్ల నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.
ఈ పొడిని ఒక్కసారి తయారు చేసుకుని నెలరోజుల పాటు కూడా మనం వాడవచ్చు. కీళ్ల నొప్పులను నయం చేసే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పొడిని తయారు చేసుకోవడానికి గాను మనం మన వంటగదిలో ఉండే మిరియాలను, జీలకర్రను, మెంతులను ఉపయోగించాల్సి ఉంటుంది. వీటిలో మన శరీరానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
మిరియాలను, మెంతులను, జీలకర్రను ఏయో మోతాదులో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 200 గ్రాముల మెంతులకు గాను 100 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల మిరియాలను తీసుకోవాల్సి ఉంటుంది. అదే టీ స్పూన్ల చొప్పున తీసుకునే వారైతే 3 టీ స్పూన్ల మెంతులకు, రెండు టీ స్పూన్ల జీలకర్రను, ఒక టీ స్పూన్ మిరియాలను తీసుకోవాల్సి ఉంటుంది. మనకు కావల్సిన పరిమాణంలో ఆయా పదార్థాలను ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది.
ఇలా నిల్వ చేసుకున్న పొడిని పూటకు అర టీ స్పూన్ మోతాదులో రోజుకు రెండు పూటలా భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. ఈ పొడి చాలా చేదుగా ఉంటుంది. కనుక దీనిలో రుచి కోసం తేనెను కానీ, పటిక బెల్లాన్ని వేసుకోవచ్చు. పంచదారను మాత్రం ఉపయోగించకూడదు. ఈ విధంగా ఈ చిట్కాను పాటించడం వల్ల శరీరంలో ఏర్పడిని వాత దోషాలు తొలగిపోయి కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.