Gongura Mutton : గోంగూర మ‌ట‌న్‌ను ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..

Gongura Mutton : మాంసాహార ప్రియుల్లో చాలా మందికి స‌హ‌జంగానే మ‌ట‌న్ అంటే ఇష్టం ఉంటుంది. చికెన్ తిన‌క‌పోయినా కొంద‌రు మ‌ట‌న్ అంటే ఎంతో ఆస‌క్తి చూపిస్తారు. ఈ క్ర‌మంలోనే వారు మ‌ట‌న్‌ను వివిధ ర‌కాలుగా తినేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. మ‌ట‌న్‌తో మ‌నం ఎక్కువ‌గా కూర‌, బిర్యానీ, ఫ్రై వంటివి చేస్తుంటాం. కానీ మ‌ట‌న్‌ను, గోంగూర‌ను క‌లిపి వండి కూడా తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే గోంగూర మ‌ట‌న్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గోంగూర మ‌ట‌న్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మ‌ట‌న్ – అర కిలో, గోంగూర – 3 క‌ట్ట‌లు, పచ్చిమిర్చి – 6, పసుపు – 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టేబుల్‌ స్పూన్, గరం మసాలా – 1 టీ స్పూన్, ఉల్లిపాయ – 1, నూనె – 1 టేబుల్‌ స్పూన్, కారం – 2 టీ స్పూన్లు, ధనియాల పొడి – 1 టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.

here it is how to make Gongura Mutton very tasty
Gongura Mutton

గోంగూర మ‌ట‌న్ ను త‌యారు చేసే విధానం..

మ‌ట‌న్‌, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు వేసి అన్నింటినీ కుక్కర్‌లో వేయాలి. అనంత‌రం అందులో కొద్దిగా నీళ్లు పోసి 4 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. పాన్ తీసుకుని అందులో నూనె పోసి వేడెక్కాక‌.. ఉల్లిపాయ‌లు, గ‌రం మ‌సాలా వేసి 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఆ త‌రువాత అల్లం వెల్లుల్లి ముద్ద‌, ప‌సుపు, క‌ట్ చేసిన ప‌చ్చిమిర్చి, గోంగూర వేసి బాగా క‌లిపి స‌న్న‌ని మంట మీద ఉడ‌కించాలి. అనంత‌రం ఉడికిన మ‌ట‌న్, త‌గినంత ఉప్పు వేసి క‌లిపి 10 నిమిషాల పాటు ఉడికించి దించాలి. అంతే.. వేడి వేడి గోంగూర మ‌ట‌న్ రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా చ‌పాతీలో వేటితో తిన్నా భ‌లే రుచిగా ఉంటుంది. ఇలా చేసుకున్న గోంగూర మ‌ట‌న్‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
Editor

Recent Posts