చిట్కాలు

దీన్ని మూడు చుక్క‌లు త‌ల‌కు రాస్తే చాలు.. తెల్ల జుట్టు పూర్తిగా న‌ల్ల‌గా మారుతుంది..

ఒక‌ప్పుడు వ‌య‌స్సు 60 ఏళ్లు దాటిన త‌రువాతే జుట్టు తెల్ల‌బ‌డేది. వెంట్రుక‌లు తెల్ల‌గా మారిపోయేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ప్ర‌స్తుతం 20 ల‌లో ఉన్న‌వారి జుట్టు కూడా తెల్ల‌గా మారుతోంది. జుట్టు తెల్ల‌గా ఉంటే న‌లుగురిలో క‌లిసేందుకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఇలా జుట్టు తెల్ల‌గా ఉండేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే వాస్త‌వానికి జుట్టు తెల్ల‌గా ఉందంటే.. అక్క‌డ న‌లుపు రంగును ఇచ్చే స‌మ్మేళ‌నాలు లేన‌ట్లే. ఇవి లేక‌పోతే జుట్టు తెల్ల‌గా మారుతుంది. మ‌న జుట్టుకు మెల‌నిన్‌ అనే స‌మ్మేళ‌నం న‌లుపు రంగును ఇస్తుంది. ఇది స‌రిపోయినంత‌గా ఉంటే జుట్టు న‌ల్ల‌గానే ఉంటుంది. లోపిస్తే మాత్రం జుట్టు తెల్ల‌గా మారుతుంది. అందుక‌నే కొంద‌రిలో జుట్టు తెల్ల‌గా ఉంటుంది. అయితే ఈ మెల‌నిన్‌ను మ‌నం పెంచుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే..

మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో కానుగ చెట్టు ఎక్కువ‌గా మ‌న‌కు క‌నిపిస్తుంటుంది. ఇది చిన్న మొక్క‌గా ఉండి పెద్ద వృక్షం వ‌ర‌కు పెరుగుతుంది. అయితే ఈ చెట్టుకు కాయ‌లు కాస్తాయి. వాటిల్లో గింజ‌లు ఉంటాయి. వాటి నుంచి నూనె తీస్తారు. దీన్నే కానుగ నూనె అంటారు. ఇది మ‌న‌కు బ‌య‌ట మార్కెట్‌లో ఎక్క‌డైనా స‌రే ల‌భిస్తుంది. దీన్ని తెచ్చుకుని ఒక పాత్ర‌లో పోసి మ‌రిగించాలి. ఈ నూనె న‌ల్ల‌గా అయ్యే వర‌కు మరిగించాలి. దీంతో అందులోకి కొన్ని స‌మ్మేళ‌నాలు విడుద‌ల‌వుతాయి. అప్పుడు ఈ నూనెను 3 చుక్క‌లు తీసుకుని అందులో త‌గినంత కొబ్బ‌రి నూనె క‌లిపి ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు బాగా రాయాలి.

turn your white hair into black with this remedy

జుట్టుకు ఈ మిశ్ర‌మాన్ని బాగా ప‌ట్టించాక 1 గంట లేదా స‌మ‌యం ఉంటే 2 గంట‌ల పాటు వేచి ఉండాలి. అనంత‌రం త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారంలో 2 నుంచి 3 సార్లు చేయాలి. దీని వ‌ల్ల జుట్టు వ‌ద్ద మెల‌నిన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. ఇది జుట్టును న‌ల్ల‌గా మారుస్తుంది. అంతేకాదు ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌లు మొత్తం త‌గ్గిపోతాయి. ముఖ్యంగా జుట్టులో ఉండే ఫంగ‌స్ త‌గ్గుతుంది. దీంతో ఇన్ఫెక్ష‌న్లు పోతాయి. చుండ్రు ఉండ‌దు. అలాగే జుట్టు కూడా పెరుగుతుంది. ఇలా కానుగ నూనె జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంతోపాటు తెల్ల జుట్టును న‌ల్ల‌గా కూడా మారుస్తుంది. క‌నుక దీన్ని త‌ర‌చూ వాడాలి. దీంతో మంచి ఫ‌లితాలు వ‌స్తాయి.

Admin

Recent Posts