UTI Home Remedies : మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్ స‌మ‌స్య‌కు.. చక్క‌ని ఇంటి చిట్కాలు..!

UTI Home Remedies : యూరిన‌రీ ట్రాక్ ఇన్ఫెక్ష‌న్ ( యుటిఐ).. మ‌న‌ల్ని వేధించే మూత్రాశ‌య సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో కూడా మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా స్త్రీలల్లో వ‌చ్చే అవకాశం ఉంది. మూత్ర‌విస‌ర్జ‌న చేసే స‌మ‌యంలో మూత్ర‌నాళం ద్వారా బ్యాక్టీరియా శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. ఇది క్ర‌మంగా యుటిఐ కు దారి తీస్తుంది. యూరీన‌రీ ట్రాక్ ఇన్ఫెక్ష‌న్ బారిన ప‌డిన‌ప్పుడు కొన్ని ల‌క్ష‌ణాలు మ‌న‌లో క‌నిపిస్తాయి. ఈ ఇన్ఫెక్ష‌న్ బారిన‌ప‌డిన‌ప్పుడు పొత్తి క‌డుపులో నొప్పిగా ఉంటుంది. త‌ర‌చూ మూత్ర‌విస‌ర్జ‌న‌కు వెళ్లాల్సి వ‌స్తుంది. అలాగే మూత్ర‌విజ‌ర్జ‌న స‌మ‌యంలో నొప్పిగా, మంట‌గా ఉంటుంది.

అలాగే మూత్రంలో ర‌క్తం కూడా వ‌స్తూ ఉంటుంది. అలాగే జ్వ‌రం, వాంతులు, మాన‌సికంగా బాగాలేక‌పోవ‌డం, త‌ల‌తిరిగిన‌ట్టుగా ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే నిర్ల‌క్ష్యం చేయ‌కుండా త‌గిన చికిత్స తీసుకోవ‌డం మంచిది. లేదంటే మూత్ర‌పిండాల ఆరోగ్యం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంటుంది. మందుల‌తో పాటు స‌హ‌జంగా కూడా మ‌నం ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. యుటిఐ తో బాధ‌ప‌డే వారు కాన్ బెర్రీ జ్యూస్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలో యాంటీ బాక్టీరియ‌ల్ లక్ష‌ణాల‌తో పాటు ఫ్లేవ‌నాయిడ్స్, ఆంథోసైనిన్స్ వంటివి ఎక్కువ‌గా ఉంటాయి.

UTI Home Remedies follow these for better effect
UTI Home Remedies

ఇవి ఇన్ఫెక్ష‌న్ ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే యుటిఐతో బాధ‌ప‌డే వారు శ‌తావ‌రి మొక్క వేరు పొడిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల స‌మస్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అదే విధంగా ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు నీటిని, పడ్ల ర‌సాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. రోజుకు క‌నీసం 6 నుండి 8 గ్లాసుల నీటిని తాగాలి. అలాగే కొబ్బ‌రి నీళ్లను తాగ‌డం వ‌ల్ల కూడా స‌మ‌స్య నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ప్రోబ‌యోటిక్స్ ను ఎక్కువ‌గా తీసుకోవాలి. మూత్ర‌విస‌ర్జ‌న చేసిన త‌రువాత శుభ్రంగా క‌డుక్కోవాలి. అలాగే ఆ భాగంలో పొడిగా ఉండేలా చూసుకోవాలి. విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి.

అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకోవాలి. వీటిలో యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు ఇన్పెక్ష‌న్ ను త‌గ్గించ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే గోరు వెచ్చ‌ని నీటిలో ఆపిల్ సైడ్ వెనిగ‌ర్ ను క‌లిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ఇన్పెక్ష‌న్ త‌గ్గుతుంది. అలాగే వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌ను పాటించాలి. స‌మ‌స్య త‌గ్గే వ‌ర‌కు లైంగిక చ‌ర్య‌ల‌ల్లో పాల్గొన‌పోవ‌డ‌మే మంచిది. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా యూరిన‌రీ ట్రాక్ ఇన్పెక్ష‌న్ నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts