Long Hair : పొడవైన, నల్లని జుట్టు ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, ఆహార పద్ధతులతో అది అసాధ్యం అనే చెప్పాలి. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే పొడవాటి జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు. అవేంటో చూడండి. చాలామంది నేను జుట్టుకు ఆయిల్ అప్లై చేస్తా అయినా కూడా ఊడిపోతుంది అని వాపోతుంటారు కానీ.. ఆ ఆయిల్ ఎలా అప్లై చేస్తున్నారన్నది పట్టించుకోరు. జుట్టు పెరగడం అనేది కుదుళ్లనుండే స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఓన్లీ వెంట్రుకలకే నూనె పెడితే ఏమైనా ఫలితం ఉంటుందా. కొంచెం గోరు వెచ్చటి కొబ్బరినూనెను జుట్టు కుదుళ్లకు అప్లై చేయాలి. ఇలా చేస్తుంటే తప్పక ఫలితం ఉంటుంది.
గుడ్లలో ఉండే ప్రోటీన్ జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో తోడ్పడుతుంది .కాబట్టి పదిహేను రోజులకొకసారి అయినా జుట్టుకి గుడ్డుని అప్లై చేయాలి. గుడ్డు ని అప్లై చేశాక 10 నుండి 20 నిమిషాలపాటు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చటి నీటితో వాష్ చేసుకోవాలి. జుట్టు పెరగడంలోనే కాదు మెరవడానికి కూడా గుడ్డులోని ప్రోటీన్ హెల్ప్ చేస్తుంది. గుడ్డుని అప్లై చేయడానికి ఇష్టపడని వారు గుడ్డు ప్లేస్ ని పెరుగుతో రీప్లేస్ చేసుకోవచ్చు. పెరుగుని ఒక బౌల్ లో తీసుకుని జుట్టు మొత్తానికి పట్టించి 10 నుండి 20 నిమిషాల పాటు ఉంచేసి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. నెలలో రెండుసార్లు ఈ విధంగా చేస్తే మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది.
కలబంద, జొజొబా ఆయిల్ మరియు తేనె ఈ మూడింటిని సమపాళ్లల్లో తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి తలస్నానం చేసినట్టయితే మీ వెంట్రుకలలో వచ్చే మార్పుని మీరే గమనిస్తారు. షాంపూ చేసుకోవడానికి ముందు గోరువెచ్చటి వాటర్ తో హెయిర్ ని కడగాలి. ఇది మీ జుట్టుని పట్టి ఉంచే దుమ్ము, నూనె లాంటి వాటిని పోగొడుతుంది. షాంపూ చేసి ఎలా పడితే అలా రుద్దేయకుండా సర్కులర్ మూమెంట్లో షాంపూ చేసుకోవాలి. తలస్నానం చేసాక టవల్ ని తలవెంట్రుకలకు చుట్టి ఉంచాలి. ఈ విధంగా కనీసం 30 నిమిషాలపాటు కట్టి ఉంచితే వెంట్రుకల కుదుళ్లను బలంగా చేయడంలోనే కాదు జుట్టు సాఫ్ట్ గా, సిల్కీగా ఉండడానికి తోడ్పడుతుంది.
వెంట్రుకలను దువ్వేటప్పుడు కూడా దువ్వెన శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి. దాంతో పాటు ఎలాపడితే అలా దువ్వకుండా ఒక క్రమ పద్ధతిలో దువ్వుకుంటూ రావాలి. అప్పు డు వెంట్రుకలు రాలడాన్ని కొంచెం వరకు తగ్గించవచ్చు. ఫైనల్ గా ఇవన్నీ చేసినప్పటికీ సరైన పోషకాహారం తీసుకోకపోతే అంతా వృథా ప్రయాసే. కాబట్టి పండ్లు, కూరగాయలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు లభించి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మీరు చెప్పలేనంత మార్పును చూస్తారు.