Whiten Teeth Naturally : ఈ చిట్కాల‌ను పాటిస్తూ మీ దంతాల‌ను స‌హ‌జంగానే తెల్ల‌గా మార్చుకోండి..!

Whiten Teeth Naturally : మ‌న ముఖం అందంగా క‌న‌బ‌డ‌డంలో దంతాలు ముఖ్య‌ పాత్ర పోషిస్తాయి. దంతాలు అందంగా, ఆరోగ్యంగా క‌నిపిస్తే మ‌న ముఖం మ‌రింత అందంగా క‌నిపిస్తుంది. దంతాలు తెల్ల‌గా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ మ‌న‌లో చాలా మంది దంతాలు ప‌సుపు రంగులోకి మార‌డం, దంతాలు పాచిప‌ట్ట‌డం, గార‌ప‌ట్ట‌డం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దంతాలు ఇలా రంగు మార‌డం వ‌ల్ల అనేక ఇబ్బుందులు ప‌డాల్సి వ‌స్తుంది. న‌లుగురిలో స‌రిగ్గా మాట్లాడ‌లేక‌పోతున్నారు. స‌రిగ్గా న‌వ్వ‌లేక‌పోతున్నారు. దంతాలు రంగు మార‌డం వ‌ల్ల ఆత్మ‌నూన్య‌త భావ‌న‌కు కూడా గురి అవుతున్నారు. రంగు మారిన దంతాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖ‌రీదైన చికిత్స‌లు చేయించుకుంటూ ఉంటారు. అనేక ర‌కాల టూత్ పేస్ట్ లను వాడుతూ ఉంటారు.

అయితే దంతాల‌ను తెల్ల‌గా, అందంగా, ఆరోగ్యంగా మార్చుకోవ‌డానికి ఇలా అధికంగా ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్పుడు చెప్పే కొన్ని స‌హ‌జ చిట్కాల‌ను పాటిస్తే స‌రిపోతుంది. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల దంతాలు తెల్ల‌గా, అందంగా మార‌తాయి. దంతాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. దంతాల‌ను తెల్ల‌గా మార్చే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దంతాల రంగును మార్చ‌డంలో ఉప్పు మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. టూత్ బ్ర‌ష్ ను త‌డిపి దానిపై మెత్త‌టి ఉప్పును వేసి దంతాల‌ను సున్నితంగా 2 నిమిషాల పాటు రుద్దాలి. త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దంతాల‌పై పేరుకుపోయిన పాచి, గారె తొల‌గిపోతుంది. దంతాల‌పై ఉండే క్రిములు న‌శిస్తాయి. అలాగే కొబ్బ‌రి నూనెను వాడ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

Whiten Teeth Naturally follow these wonderful home remedies
Whiten Teeth Naturally

స్వ‌చ్చ‌మైన కొబ్బ‌రి నూనెను వాడ‌డం వ‌ల్ల నోటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. దంతాల‌పై పేరుకుపోయిన పాచి తొల‌గిపోతుంది. దీని కోసం నోట్లో ఒక టేబుల్ స్పూన్ కొబ్బ‌రి నూనె వేసుకుని 15 నుండి 20 నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మి వేయాలి. త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా తొల‌గిపోతుంది. దంత క్ష‌యం వంటి స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. అలాగే ఆపిల్ సైడ్ వెనిగ‌ర్ ను వాడ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. నీటిలో ఆపిల్ సైడ్ వెనిగ‌ర్ వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ నీటిని నోట్లో పోసుకుని అర నిమిషం పాటు పుక్కిలించి ఉమ్మి వేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దంతాల‌పై ఉండే మ‌ర‌క‌లు తొల‌గిపోతాయి. నోట్లో ఉండే క్రిములు న‌శిస్తాయి. నోటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అయితే ఆపిల్ సైడ్ వెనిగ‌ర్ ఆమ్ల‌త‌త్వాన్ని ఎక్కువ‌గా క‌లిగి ఉంటుంది. క‌నుక దీనిని త‌క్కువ‌గా వాడ‌డం మంచిది.

అదే విధంగా దంతాల‌ను తెల్ల‌గా మార్చ‌డంలో వంట‌సోడా కూడా మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. వంట‌సోడాలో నీళ్లు క‌లిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ పేస్ట్ ను టూత్ బ్ర‌ష్ తో తీసుకుని 2 నిమిషాల పాటు దంతాల‌ను శుభ్రం చేసుకుని నీటితో క‌డ‌గాలి. ఇలా దంతాల‌పై ఉండే గారె, పాచి తొల‌గిపోతుంది. నోటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియా న‌శిస్తుంది. దంతాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఇక బొగ్గు పొడిని వాడ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. అయితే ఈ పొడి గ‌రుకుగా ఉంటుంది క‌నుక దీనిని వాడ‌డంలో కొద్దిగా ఇబ్బంది క‌లుగుతుంది. అలాగే దీనిని ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్ల దంతాల‌పై ఉండే ఎనామిల్ దెబ్బ‌తినే అవ‌కాశం కూడా ఉంది. క‌నుక త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ బొగ్గు పొడిని వాడ‌డం వ‌ల్ల దంతాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల దంతాలు తెల్ల‌గా మార‌డంతో పాటు నోటి ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.

D

Recent Posts