Eye Burn : కంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందనే చెప్పవచ్చు. కళ్లు మండడం, కళ్లు పోట్లు, కళ్ల నుండి నీరు కారడం వంటి కంటి సమస్యలు ప్రస్తుత కాలంలో అతి సామాన్యమైపోయాయి. ఇటువంటి కంటి సమస్యలు రావడానికి మారిన జీవన విధానమే కారణమని చెప్పవచ్చు. పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, కంప్యూటర్లు, టీవీలు, సెల్ ఫోన్ల వాడకం ఎక్కువవడం వంటి వాటి వల్ల కంటి సమస్యలు ఎక్కువవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కంటి సమస్యలతో బాధపడే వారు ఇంటి చిట్కాలను ఉపయోగించి కంటికి సంబంధించిన ఆయా సమస్యలను దూరం చేసుకోవచ్చు.
కంటి సమస్యలను తగ్గించడంలో మల్లెపువ్వు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మల్లెపువ్వులను ఉపయోగించి కంటి సమస్యలను ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కళ్ల నుండి కారడం, కళ్ల పోట్లు, కళ్లు మండడం వంటి సమస్యలతో బాధపడే వారు మల్లెపువ్వులను ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. కంటి సమస్యలతో బాధపడే వారు మల్లెపువ్వులను మెత్తగా ముద్దగా చేయాలి. ఈ మిశ్రమాన్ని కళ్లు మూసి కళ్లపై ఉంచి పడుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ల నుండి నీరు కారడం, కళ్ల పోట్లు, కళ్లు మండడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల కళ్లకు ఎంతో హాయిగా ఉంటుంది. చక్కగా నిద్ర పడుతుంది.
మల్లెపువ్వులు మనకు ఏడాది పొడవునా లభించవు. కనుక మల్లెపువ్వులు లేని సమయంలో మల్లె చెట్టు ఆకులను కూడా ఉపయోగించవచ్చు. అదే విధంగా ఇతరత్రా కంటి సమస్యలను తగ్గించే మరిన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక శుభ్రమైన వస్త్రాన్ని తీసుకుని గోరు వెచ్చని నీటిలో ముంచి నీటిని పిండాలి. తరువాత ఈ వస్త్రాన్ని కళ్లపై 5 నిమిషాల పాటు ఉంచిన తరువాత అదే వస్త్రంతో కళ్లపై సున్నితంగా మర్దనా చేసుకోవాలి. తరువాత అదే వస్త్రంతో కళ్లను నెమ్మదిగా శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల కన్నీళ్లు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి కళ్లు పొడిబారకుండా ఉంటాయి.
అలాగే కొబ్బరి నూనెలో దూదిని ముంచి కళ్లపై 15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల కళ్ల పై ఒత్తిడి తగ్గి కళ్లకు హాయిగా ఉంటుంది. కళ్లకు విశ్రాంతి లభించే వరకు ఇలా ఎన్నిసార్లైనా చేయవచ్చు. అలాగే కలబంద గుజ్జును కంటి రెప్పలపై రాసి కళ్లు మూసుకుని 15 నిమిషాల పాటు ఉండాలి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. కంటి సమస్యలతో బాధపడే వారు ఇలా చేయడం వల్ల కూడా చక్కటి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల కళ్ల దురదలు, మంటలు తగ్గుతాయి.
కళ్లు పొడిబారడం వంటి సమస్యతో బాధపడే వారికి రోజ్ వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్ లో దూదిని ముంచి ఆ దూదిని కళ్లపై 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తరువాత కళ్లను చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లు పొడిబారకుండా ఉంటాయి. అదే విధంగా మనం తీసుకునే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వాల్ నట్స్, చేపలు, అవిసె గింజలు వంటి ఆహారాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ పదార్థాలను మనం రోజూ తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల కళ్ల సమస్యతో బాధపడే వారు చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు.