Beard Growth : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. గ‌డ్డం బాగా పెరుగుతుంది..!

Beard Growth : పురుషుల‌కు గ‌డ్డం ఎంతో అందాన్ని ఇస్తుందని చెప్ప‌వ‌చ్చు. ఒక వ‌య‌సు వ‌చ్చే స‌రికి పురుషుల‌కు గడ్డం బాగా పెరుగుతుంది. గ‌డ్డం పెంచుకోవ‌డం అనేది ప్ర‌స్తుత కాలంలో యువ‌త‌కు ఫ్యాష‌న్ గా మారింద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే కొంద‌రిలో మాత్రం ఎంత ప్ర‌య‌త్నించినా కూడా గ‌డ్డం పెర‌గ‌దు. గ‌డ్డం పెర‌గ‌క ఇబ్బంది ప‌డే వారు చాలా మంది ఉండే ఉంటారు. గ‌డ్డం పెర‌గ‌క‌పోవ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. కార‌ణాలేవైన‌ప్ప‌టికీ ఇక‌పై గ‌డ్డం పెర‌గ‌డం లేద‌ని చింతివ‌ల‌సిన ప‌ని లేదు. కొన్ని ర‌కాల చిట్కాల‌ను పాటించి సుల‌భంగా గ‌డ్డాన్ని పెంచుకోవ‌చ్చు. గ‌డ్డం పెర‌గ‌డానికి ఉప‌యోగ‌ప‌డే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మీసం, గ‌డ్డం చ‌క్క‌గా పెంచుకోవ‌డానికి యువ‌త ఎన్నో ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ప్ర‌తిరోజూ షేవింగ్ చేసుకుంటే కూడా గ‌డ్డం బాగా పెరుగుతుంద‌ని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ షేవింగ్ చేయ‌డం వ‌ల్ల గ‌డ్డం పెరుగుతుంది అనుకోవ‌డం అపోహ మాత్రమే. దీని వ‌ల్ల ముఖం గ‌రుకుగా మార‌తుంది త‌ప్ప ఎటువంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. క‌నుక ప్ర‌తిరోజూ షేవింగ్ చేసుకోవ‌డం మానివేస్తే మంచిది. గ‌డ్డాన్ని బాగా పెంచుకోవాల‌నుకునే వారు యూక‌లిప్ట‌స్ నూనెలో నువ్వుల నూనెను లేదా ఆలివ్ నూనెను క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకోవాలి. ఆ త‌రువాత నూనె చ‌ర్మంలోకి ఇంకేలా బాగా మ‌ర్ద‌నా చేసిన 20 నిమిషాల త‌రువాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్ర‌ప‌రుచుకోవాలి.

follow these natural home remedies for Beard Growth
Beard Growth

గ‌డ్డం బాగా పెరిగేలా చేయ‌డంలో నిమ్మ‌ర‌సం కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. 2 టేబుల్ స్పూన్ల నిమ్మ‌ర‌సంలో ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మంపై రాసుకుని ఆరిన త‌రువాత చ‌ల్ల‌టి నీటితో క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వల్ల గ‌డ్డం పెరిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే కొన్ని ఆవాల ఆకుల‌ను పేస్ట్ గా చేసి అందులో ఉసిరి నూనెను వేసి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని గ‌డ్డం రాని చోట చ‌ర్మంపై రాయాలి. ఈ మిశ్ర‌మం పూర్తిగా ఆరిన త‌రువాత నీటితో క‌డ‌గాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా గ‌డ్డం త్వ‌ర‌గా వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

ఈ చిట్కాల‌ను పాటిస్తూనే ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఒత్తిడికి గురి కాకుండా జాగ్ర‌త్త‌గా ఉండాలి. చ‌క్క‌గా నిద్ర పోవాలి. రోజుకు క‌నీసం 8 గ్లాసుల నీటిని తాగాలి. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల గ‌డ్డం ఒత్తుగా, న‌ల్ల‌గా పెరుగుతుంది.

Share
D

Recent Posts