Sweat : మామూలుగా క‌న్నా చెమ‌ట అధికంగా ప‌డుతుందా.. అయితే ఇలా చేయండి..!

Sweat : చెమ‌ట‌… ఇది మ‌న చ‌ర్మం నుండి ఉత్పత్తి అవుతుంది. చ‌ర్మంలోని స్వేద గ్రంథుల నుండి త‌యారవుతుంది. ఇందులో ముఖ్యంగా నీరు, ల‌వ‌ణాలు, క్లోరైడ్స్ తో క‌లిసి ఉంటుంది. స్వేదంలో దుర్వాస‌న క‌లిగించే ప‌దార్థాల‌తో పాటు కొద్దిగా యూరియా కూడా ఉంటుంది. శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త‌లు నియంత్రించే విధానాల్లో చెమ‌ట ప‌ట్ట‌డం కూడా ఒక‌టి. అయితే పురుషుల స్వేదంలో కామ ప్ర‌కోపాన్ని అధికం చేసే ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టుగా నిపుణులు క‌నుగొన్నారు. కొంద‌రిలో భ‌యం క‌లిగిన‌ప్పుడు కూడా చెమ‌ట ప‌డుతుంది. చ‌ర్మం మీది చెమ‌ట ఆవిరిగా మారిన‌ప్పుడు శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. ఉష్ణ ప్ర‌దేశాల్లో వ్యాయామాలు చేసిన‌ప్పుడు ఎక్కువ‌గా చెమ‌ట ప‌డుతుంది.

మాన‌సిక ఒత్తిడి వ‌ల్ల చెమ‌ట ప‌ట్ట‌డం ఎక్కువ‌వుతుంది. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో చెమ‌ట త‌క్కువ‌గా ఉంటుంది. మ‌న శ‌రీరంలో కొన్ని భాగాల్లో చెమ‌ట ఎక్కువ‌గా ప‌డుతుంది. త‌ల‌, బాహు మూల‌లు, ముఖంలో స్వేద గ్రంథులు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ఈ ప్ర‌దేశాల్లో చెమ‌ట ఎక్కువ‌గా ప‌డుతుంది. ప్ర‌తి ఒక్క‌రికి చ‌ర్మంపై స్వేద గ్రంథులు ఉంటాయి. వీటి ద్వారా చెమ‌ట బ‌య‌ట‌కు వ‌స్తుంది. చెమ‌ట నీటి రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తుంది. మ‌న శ‌రీరంలో అంత నీరు ఎక్క‌డ‌ ఉంది అని చాలా మంది అనుకుంటారు. మ‌నం తాగిన నీరు మ‌రియు ఇత‌ర ద్రవ‌ ప‌దార్థాలే స్వేద గ్రంథుల నుండి చెమ‌ట రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తాయి. అలాగే ప్ర‌తి ఒక్క‌రికి రెండు ర‌కాల స్వేద గ్రంథులు ఉంటాయి.

wonderful home remedies for over sweat
Sweat

అందులో మొద‌టిది ఎపో క్రైస్ట్ స్వేద గ్రంథులు. ఇవి బాహు మూల‌ల్లో, వ‌క్షోజాల్లో ఎక్కువ‌గా ఉంటాయి. ఇక రెండ‌వది ఎక్రైస్ట్ స్వేద గ్రంథులు. ఇవి శ‌రీర‌మంతా ఉండి దేహాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌డానికి ఉప‌క‌రిస్తాయి. కొంత‌మందికి చెమ‌ట ఎక్కువ‌గా పట్ట‌డం వ‌ల్ల బాహుమూల‌ల్లో దుర్వాస‌న ఎక్కువ‌గా వ‌స్తుంది. ఈ దుర్వాస‌న బ్యాక్టీరియా వ‌ల్ల వ‌స్తుంది. కొంత‌మందికి చెమ‌ట త‌క్కువ‌గా ప‌డుతుంది. మ‌రి కొంత‌మందికి చెమ‌ట అస‌లు ప‌ట్ట‌దు. ఈ చెమ‌ట గురించి మ‌న పెద్ద‌లు కొన్ని విష‌యాలు చెబుతారు. ప‌సి పిల్ల‌లుగా ఉన్న‌ప్పుడు న‌లుగు పెట్టి స్నానం చేయించ‌డం వ‌ల్ల చ‌ర్మం పై ఉండే స్వేద గ్రంథులు తెరుచుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు చెమ‌ట ప‌డుతుంద‌ని చెబుతుంటారు. చిన్న‌ప్పుడు న‌లుగు పెట్ట‌ని వారికి చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్ట‌దని అంటుంటారు. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు కానీ ఈ చెమ‌ట‌ను ఎలా నివారించుకోవాలో తెలియ‌క చాలా మంది ఇబ్బందిప‌డుతుంటారు.

చెమ‌ట‌ను కొన్ని చిట్కాల వ‌ల్ల తొల‌గించుకోవ‌చ్చు. చెమ‌ట నుండి వ‌చ్చే దుర్వాస‌న‌ను త‌గ్గించుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకుని అందులో శ‌న‌గ‌పిండి వేసి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను శ‌రీరానికి రాసుకోవాలి. ఈ మిశ్ర‌మం ఆరిన త‌రువాత స్నానం చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల శ‌రీర దుర్గాంధాన్ని నివారించుకోవ‌చ్చు. అలాగే గంధం పొడి, ప‌సుపు, కుంకుమ పువ్వు, క‌ర్పూరాన్ని తీసుకుని పొడిగా చేయాలి. ఈ పొడికి కొద్దిగా నీటిని క‌లిపి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను శ‌రీర బాహూ మూల‌ల్లో రాయాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌న శ‌రీరంలో గాలి త‌గ‌ల‌ని ప్ర‌దేశాలు చాలా ఉన్నాయి. వాటి నుండి కూడా దుర్వాస‌న వ‌స్తూ ఉంటుంది. ఈ దుర్వాస‌న‌ను త‌గ్గించడానికి ఆయా భాగాల్లో బేకింగ్ సోడా, నిమ్మ‌ర‌సం క‌లిపిన మిశ్ర‌మాన్ని రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దుర్వాస‌న త‌గ్గుతుంది. పుదీనా ఆకుల‌ను పేస్ట్ లా చేసి దుర్వాస‌న వ‌చ్చే చోట రాస్తూ ఉండ‌డం వల్ల కూడా ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చెమ‌ట నుండి వ‌చ్చే దుర్వాస‌న‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

D

Recent Posts