Curd And Cumin : పెరుగులో జీల‌క‌ర్ర క‌లుపుకుని ఈ స‌మ‌యంలో తినండి.. ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం క‌రుగుతుంది..

Curd And Cumin : మ‌న పోపుల డ‌బ్బాలో ఉండే దినుసుల్లో జీల‌క‌ర్ర ఒక‌టి. ఇది ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ఉంటుంది. ఎంతోకాలంగా జీల‌క‌ర్ర‌ను మ‌నం వంటల్లో ఉప‌యోగిస్తున్నాం. జీల‌క‌ర్ర‌ను వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. జీల‌క‌ర్ర‌లో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శ‌రీరంలో ఉండే కొవ్వును క‌రిగించ‌డంలో జీల‌క‌ర్ర ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. వైద్య నిపుణులు జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో జీల‌క‌ర్ర ద్వారా అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిరూపిత‌మైంది. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు రోజూ ఉద‌యం జీల‌క‌ర్ర టీ ని తాగ‌డం వ‌ల్ల త్వర‌గా బ‌రువు త‌గ్గుతారు. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు.

మ‌న‌కు ఎంత‌గానో మేలు చేసే ఈ జీల‌క‌ర్ర టీ ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టీ ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక అందులో రెండు టీ స్పూన్ల జీల‌క‌ర్ర పొడిని వేసి మ‌రిగించాలి. త‌రువాత ఈ టీ ని వ‌డ‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ తేనెను క‌లిపి తాగాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేయ‌డం వ‌ల్ల నెల‌రోజుల్లోనే ఊహించ‌ని విధంగా బ‌రువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా జీల‌క‌ర్ర‌ను, పెరుగుతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల కూడా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

take Curd And Cumin daily at this time for many benefits
Curd And Cumin

నిత్యం మ‌న ఇంట్లో ఆహార‌ప‌దార్థాల్లో పెరుగు ఒక‌టి. దీనిలో జీల‌క‌ర్ర‌ను క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గంతో పాటు అనేక ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఇప్పుడు పెరుగు, జీల‌క‌ర్ర మిశ్ర‌మాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీని కోసం మ‌నం ఒక క‌ప్పు పెరుగును, ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర పొడిని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. త‌రువాత అందులో ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర పొడిని వేసి బాగా క‌ల‌పాలి. ప్ర‌తిరోజూ ఉద‌యం అల్పాహారం చేసిన గంట త‌రువాత ఈ పెరుగు, జీల‌క‌ర్ర మిశ్ర‌మాన్ని తినాలి. ఆ స‌మ‌యంలో కుద‌రని వాళ్లు సాయంత్రం టీ తాగిన ఒక గంట త‌రువాత తినాలి.

ఈ మిశ్ర‌మాన్ని క్రమం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువును ఇట్టే త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రిగిపోతుంది. శ‌రీరంలో జీవ‌క్రియల రేటును పెంచ‌డంలో జీల‌క‌ర్ర ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. జీల‌క‌ర్ర‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ట్రై గ్లిజ‌రాయిడ్ అనే కొవ్వు 25 శాతం త‌గ్గుతుంది. ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉండడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. రోజూ వారి వంట‌ల్లో జీల‌క‌ర్ర‌ను అధికంగా వాడినా కూడా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఈ విధంగా జీల‌క‌ర్ర మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుందని దీనిని టీ లేదా పెరుగుతో క‌లిపి తీసుకోవ‌డం వల్ల బ‌రువు తగ్గ‌డంతో పాటు మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

D

Recent Posts