Piles : ప్రస్తుత తరుణంలో చాలా మంది మొలల సమస్యతో బాధపడుతున్నారు. వీటినే పైల్స్ అని కూడా అంటారు. ఇవి మూడు రకాలుగా ఉంటాయి. కొన్ని రకాల మొలలు పెద్దగా ఉండవు మల విసర్జన మార్గంలో ఉండి ఇబ్బందులకు గురి చేస్తాయి. కొన్ని లోపలి వైపు, కొన్ని బయటి వైపు ఉంటాయి. వీటిని బాహ్య మొలలు అంటారు.
మొలలు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. నీటిని సరిగ్గా తాగకపోవడం, ఫైబర్ ఎక్కువగా తీసుకోకపోవడం, అధికంగా కూర్చోవడం, ఒత్తిడి, ఆందోళ, థైరాయిడ్ వంటి సమస్యలు ఉండడం.. వంటి అనేక కారణాల వల్ల మొలలు వస్తుంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. మళ్లీ మొలలు రాకుండా చూసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో సగం నిమ్మకాయ ముక్కను పూర్తిగా రసం పిండాలి. అందులోనే పావు టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలిపి ఉదయం పరగడుపునే తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఎలాంటి మొలలు అయినా సరే తగ్గిపోతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. గ్యాస్ ఉండదు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది.
ఇక బాహ్య మొలలు.. అంటే బయటి వైపు మొలలు ఉండి ఇబ్బందులు పడుతున్నవారు ఇలా చేయాలి. వాము గింజలు కొన్నింటిని తీసకుని నీటిలో 4-5 గంటలు నానబెట్టాలి. అనంతరం నీరు వంపేసి వాము గింజలను పేస్ట్ చేయాలి. అందులో కొద్దిగా పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పూట నిద్రకు ముందు మొలలపై రాయాలి. ఇలా చేస్తుంటే పైల్స్ రాలిపోతాయి. ఎంతగానో ఉపశమనం లభిస్తుంది.
ఇక ఈ సమస్య నుంచి బయట పడిన వారు రోజూ వ్యాయామం చేయడంతోపాటు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి. కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, నట్స్, విత్తనాలను అధికంగా తీసుకోవాలి. దీంతో మొలల సమస్య రాకుండా చూసుకోవచ్చు. అలాగే నీటిని కూడా తగినంత మోతాదులో తాగాలి. ఈ విధంగా జాగ్రత్తలు పాటిస్తే మొలలు మళ్లీ రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.