Indigestion : క‌డుపు ఉబ్బ‌రం, అజీర్ణం స‌మ‌స్య‌లు ఉన్న‌వారు.. ఇలా చేస్తే చాలు.. దెబ్బ‌కు రిలీఫ్ వ‌స్తుంది..!

Indigestion : గ్యాస్ కార‌ణంగా క‌డుపు ఉబ్బ‌రంగా అనిపించ‌డం.. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక‌పోవ‌డం.. వంటి స‌మ‌స్య‌లు స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటాయి. అయితే ఈ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ కింద తెలిపిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలంటే..

follow these wonderful home remedies for Indigestion  and gas trouble

1. పుదీనా లేదా గ‌డ్డి చామంతి పువ్వుల‌తో త‌యారు చేసిన హెర్బ‌ల్ టీని రోజుకు రెండు సార్లు తాగుతుండాలి. దీని వ‌ల్ల గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య త‌గ్గుతుంది. పొట్టంతా తేలిగ్గా మారుతుంది. అలాగే తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

2. ఇంగువ‌ను స‌హ‌జంగానే చాలా మంది ప‌లు ర‌కాల వంట‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. ఇంగువ వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా ఇంగువ క‌లిపి తాగాలి. ఇలా రోజుకు 3 సార్లు చేయాలి. 2 రోజుల పాటు ఈ విధంగా చేస్తే స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

3. రోజంతా సాధార‌ణ నీటికి బ‌దులుగా గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగుతుండాలి. దీంతో శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. అలాగే జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

4. భోజ‌నం చేసిన త‌రువాత గుప్పెడు సోంపు గింజ‌ల‌ను నోట్లో వేసుకుని బాగా న‌మిలి మింగాలి. దీని వ‌ల్ల ఎలాంటి గ్యాస్ స‌మ‌స్య అయినా స‌రే త‌గ్గిపోతుంది. క‌డుపు ఉబ్బ‌రం ఉండ‌దు. అజీర్ణం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts