Home Tips

Suitcase : సూట్ కేస్‌ల‌లో దుస్తుల‌ను ఎలా స‌ర్దుకోవాలో తెలుసా..?

Suitcase : ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు.. ఇత‌ర సంద‌ర్భాల్లో స‌హ‌జంగానే చాలా మంది సూట్‌కేస్‌ల‌ను వాడుతుంటారు. ఇవి ఒక‌ప్పుడు సాధార‌ణంగా ఉండేవి. కానీ ప్ర‌స్తుతం అనేక ర‌కాల మోడ‌ల్స్ మ‌న‌కు వీటిలో అందుబాటులో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఎవ‌రి సౌక‌ర్యానికి.. స్థోమ‌త‌కు త‌గిన‌ట్లుగా వారు సూట్‌కేస్‌ల‌ను వాడుతున్నారు. ఇక సూట్ కేస్‌లలో అధికంగా దుస్తుల‌ను మోయాల్సి వ‌స్తే.. ట్రాలీ సూట్ కేస్‌ల‌ను వాడుతున్నారు. దీంతో వాటిని తీసుకెళ్ల‌డం సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది.

అయితే ట్రాలీ సూట్ కేస్‌ల‌ను తీసుకెళ్ల‌డం సుల‌భ‌మే. కానీ వాటిల్లో దుస్తులను చాలా మంది పొర‌పాటుగా స‌ర్దుతుంటారు. వాస్త‌వానికి సూట్ కేస్‌ను కింద ప‌డుకోబెట్టి అందులో దుస్తుల‌ను ఒకదాని మీద ఒక పెడుతుంటారు. కానీ అలా కాదు. సూట్ కేస్‌ను నిలువుగా పెట్టి అందులో దుస్తుల‌ను స‌ర్దాలి.

this is how you arrange clothes in suitcase

చిత్రంలో చూపిన‌ట్లుగా సూట్‌కేస్‌ను నిలువుగా ఉంచి అందులో దుస్తుల‌ను ఒక‌దానిమీద ఒక‌టి పెట్టి స‌ర్దాలి. మ‌నం బీరువాలో దుస్తుల‌ను ఉంచిన‌ట్లు పెట్టుకోవాలి. ఇలా స‌ర్ద‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా సూట్‌కేస్ లో దుస్తుల‌ను పెట్ట‌వ‌చ్చు. ప్ర‌యాణాల్లో ఉన్న‌ప్పుడు మ‌న‌కు కొన్ని దుస్తుల‌ను తీయాలంటే పైన ఉన్న అన్నింటినీ తీయాల్సి వ‌స్తుంది. కానీ ఇలా స‌ర్దుకుంటే నేరుగా కింద ఉన్న దుస్తుల‌నే సుల‌భంగా తీయ‌వ‌చ్చు. మ‌ళ్లీ సులభంగా స‌ర్దుకోవ‌చ్చు. క‌నుక మీరు ఇక‌పై ఎప్పుడైనా సూట్ కేస్‌ల‌ను స‌ర్దాల్సి వ‌స్తే వాటిల్లో దుస్తుల‌ను ఇలా పెట్టుకోండి. సుల‌భంగా దుస్త‌లను స‌ర్ద‌వ‌చ్చు. సుల‌భంగా తీయ‌వ‌చ్చు..!

Admin

Recent Posts