information

ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన 10 ముఖ్యమైన చట్టాలు

<p style&equals;"text-align&colon; justify&semi;">రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది&period; తాను ప్రమాదంలో ఉన్న అని దిశ తన చెల్లికి ఫోన్ చేయడం&comma; వాళ్ళు వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్లు రెఫ్యూజ్ చేయడంతో అంత రాత్రి ఏం చేయాలో తెలియక మరో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఫైల్ చేసి తీరా&comma; పోలీసులు యాక్షన్ తీసుకునేసరికి దిశ కాలి బూడిదైపోయింది&period; ఏ పోలీస్ స్టేషన్ అయినా ఆపద అంటూ వస్తే కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాలి&period; ఒకవేళ ఆ కేసు తమ పరిధిలోకి రాదు అనుకుంటే తరువాత ఆ ఎఫ్ ఐ ఆర్ కాపీని ట్రాన్స్ఫర్ చేయాలి&period; ఇది చట్టమే చెప్తుంది&period; కేవలం ఇది మాత్రమే కాదు సామాన్యులకి తెలియని&comma; తెలియాల్సిన కొన్ని చట్ట నియమాలు ఉన్నాయి&period; అవేంటో ఈ రోజు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;1 ఉదయం ఆరు లోపు&comma; సాయంత్రం ఆరు తర్వాత పోలీస్ స్టేషన్ కి రావడానికి మహిళలు తిరస్కరించే హక్కు ఉంది&period; మరి తీవ్రమైన నేరం చేసినట్లయితే మెజిస్ట్రేట్ పర్మిషన్ తో వారిని అరెస్టు చేయవచ్చు&period; అది కూడా మహిళా పోలీస్ ఆధ్వర్యంలోనే ఒక మహిళ నిందితురాలిని&sol;ఖైదీని అరెస్టు చేయాలంటే కేవలం మహిళా పోలీస్ ఆఫీసర్&sol; కానిస్టేబుల్ ఉండాలి&period; మగ పోలీస్ లకు హక్కు లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;2 సాధారణంగా ఇళ్లలో గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదాలు సంభవించినట్లయితే&comma; స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించి&comma; గ్యాస్ ఏజెన్సీ నుండి నష్టపరిహారంగా 50 లక్షలు క్లైమ్ చేయవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;3 మేజర్లు కాకపోయినప్పటికీ ఇద్దరు యువతి యువకులు సహజీవనం చేయవచ్చు&period; వీరికి పుట్టిన పిల్లలకు చట్టపరమైన అన్ని హక్కులు లభిస్తాయి&period; గుర్తుంచుకోండి మన చట్టాల ప్రకారం మైనర్లు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;4 హిందూ అడాప్షన్ మరియు మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తికి కొడుకు లేదంటే మనవడు ఉన్నట్టయితే అతడు మరొకరిని దత్తత తీసుకోవడానికి వీలు లేదు&period; ఒకవేళ అలా తీసుకోవాలనుకుంటే ఇద్దరు పిల్లల మధ్య వయసు తేడా సుమారు 21 సంవత్సరాలు ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70218 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;law&period;jpg" alt&equals;"10 important laws in india you must know " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;5 గర్భిణీ స్త్రీని ఉద్యోగంలో నుండి తీసే హక్కు ఏ కంపెనీకి లేదు&period; ఒకవేళ అలా చేసినట్లయితే మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;6 అమ్మకం దారుడు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ రేటుకి అమ్మే హక్కు లేదు&comma; కానీ ఎం ఆర్ పి కంటే తక్కువ ధరకి బెరమాడే హక్కు కొనుగోలుదారుడికి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;7 మీరు ఒక నేరానికి శిక్ష అనుభవించినట్లయితే&comma; అదే తరహా నేరానికి అదే రోజు &lpar;సేమ్ డే సేమ్ క్రైమ్&rpar; శిక్షించడానికి హక్కు లేదు&period; ఉదాహరణకు ఒక రోజు మీరు హెల్మెట్ లేకుండా ఒకసారి పట్టుబడి ఫైన్ కట్టారు&comma; సేమ్ డే అదే నేరానికి మీరు పట్టుబడితే ఫైన్ కట్టాల్సిన పని లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;8 ఒక పోలీస్ ఆఫీసర్ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడానికి నిరాకరించినట్లయితే&comma; అతనిపై కంప్లైంట్ ఫైల్ చేసే హక్కు ఉంటుంది&period; అది నిరూపితం అయితే ఆరు నెలల నుండి ఏడాది వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;9 ఏ ఫైవ్ స్టార్ హోటల్లో అయినా మంచి నీళ్లు తాగడానికి&comma; వాష్రూమ్స్ వినియోగించుకోవడానికి హక్కు ఉంటుంది&period; వద్దని చెప్పడానికి ఆ హోటల్ వాళ్లకు హక్కు లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;10 యూనిఫాం లో ఉన్నా&comma; లేకపోయినా ఒక పోలీస్ ఆఫీసర్ 24 గంటలు డ్యూటీలో ఉన్నట్టే&period; ఒకవేళ అతడు డ్యూటీలో లేనని మీ ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరిస్తే అది చట్టరీత్యా నేరం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts