information

Gold Jewellery Cleaning : ఇలా బంగారు ఆభరణాలని క్లీన్ చెయ్యండి.. కొత్తవాటిలా మారిపోతాయి.. పైగా ఈజీ కూడా..!

Gold Jewellery Cleaning : బంగారం అంటే, ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా, బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. బంగారం ధర పెరిగిపోవడంతో, ఇప్పుడు కొనడం కష్టమే. పార్టీలు, పెళ్లిళ్లు మొదలైన ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు, కచ్చితంగా బంగారు నగల్ని అందరూ వేసుకుంటారు. ఇవన్నీ పక్కన పెడితే, బంగారు నగలని క్లీన్ చేసుకోవడం, పెద్ద సమస్యగా ఉంటుంది. బంగారు నగలు నల్లగా మారిపోతూ ఉంటాయి. వాటిని మెరసేలా చేయాలంటే, ఎక్కువ కష్టపడాలి అని, చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, నల్లగా అయిపోయిన బంగారు నగలని క్లీన్ చేయాలంటే, ఇలా చేయొచ్చు.

ఇలా చేయడం వలన, ఈజీగా కొత్త నగల్లా మెరిసిపోతాయి. పైగా ,పెద్దగా కష్టపడక్కర్లేదు. సబ్బు నీళ్లతో క్లీన్ చేస్తే, 15 నిమిషాల్లో తెల్లగా వచ్చేస్తాయి. దీనికోసం మీరు, కొంచెం సేపు బంగారు నగల్ని సబ్బు నీళ్లల్లో నానబెట్టండి. తర్వాత, టూత్ బ్రష్, సాఫ్ట్ బ్రష్ తో రుద్దండి. కాటన్ క్లాత్ తో నగలని, ఫైనల్ గా తుడిచేయండి. కొత్త వాటిల్లా మెరిసిపోతాయి. ఒకవేళ కనుక వజ్రాలు, కెంపులు, పచ్చలు వంటివి ఉన్నట్లయితే, సబ్బు నీటిని వాడి మురికిని పోగొట్టవచ్చు.

Gold Jewellery Cleaning follow these tips

ముత్యాలు మృదువైన పదార్థాలతో చేస్తారు. కాబట్టి, తేలికపాటి షాంపుతో క్లీన్ చేయడం మంచిది. అలా చేస్తే రంగు మారిపోకుండా ఉంటాయి. నగలను తెల్లగా మార్చుకోవడానికి, కొంచెం టూత్ పేస్ట్ ని వాడొచ్చు. దుమ్ము, ధూళి ఈజీగా పోతుంది. నగలు క్లీన్ అయిపోతాయి. సబ్బు నీళ్ళల్లో ఒక క్లాత్ ని ముంచి, టూత్ పేస్ట్ రాసి క్లీన్ చేసుకోవచ్చు. బంగారం ఆభరణాలు గిన్నెలో వేసి, అవి మునిగే వరకు గోరువెచ్చని పోసి ఉంచండి.

మురికి, జిడ్డు వంటివి తొలగిపోతాయి. మెత్తని బ్రష్ ని కానీ కాటన్ క్లాత్ ని కానీ క్లీన్ చేయడానికి వాడండి. నగలు మెరుస్తాయి. ఎప్పుడూ కూడా బంగారు ఆభరణాలని, గట్టిగా రుద్దకండి. మెల్లగా క్లీన్ చేయాలి. గట్టిగా చేస్తే విరిగే అవకాశం ఉంది. కాబట్టి, ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా చేసుకోండి.

Admin

Recent Posts