information

మీ వ‌ద్ద ఉన్న బంగారం అస‌లైందా, న‌కిలీదా..? ఈ చిట్కాల‌తో సుల‌భంగా గుర్తించండి..!

డ‌బ్బును ఎందులో అయినా పెట్టుబ‌డిగా పెట్ట‌ద‌లిస్తే చాలా మంది ఎంచుకునే మార్గాల్లో ఒక‌టి.. బంగారం.. బంగారంపై పొదుపు చేస్తే క‌చ్చితంగా లాభం వ‌స్తుంది. ఇక గిఫ్ట్‌లుగా కూడా బంగారు ఆభ‌ర‌ణాల‌ను ఇస్తుంటారు. పెళ్లిళ్లు, ఇత‌ర శుభ కార్యాల్లోనూ బంగారు ఆభ‌ర‌ణాల‌దే పైచేయి. అయితే మార్కెట్‌లో మ‌నం కొనే బంగారం అస‌లుదా, న‌కిలీదా ? అని తెలుసుకోవ‌డం ఎలా ? అంటే.. అందుకు ఈ సూచ‌న‌లు పాటించాలి.

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల ప్ర‌కారం 41.7 శాతం లేదా 10 క్యారెట్ల క‌న్నా త‌క్కువ నాణ్య‌త ఉన్న బంగారాన్ని న‌కిలీ లేదా క‌ల్తీ బంగారంగా భావిస్తారు. న‌కిలీ, అస‌లు బంగారాన్ని కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించ‌డం ద్వారా సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు.

స్వ‌చ్ఛ‌మైన బంగారం అయితే అయ‌స్కాంతానికి ఆక‌ర్ష‌ణ ఉండదు. ఇత‌ర లోహాలు అయితే అయ‌స్కాంతానికి ఆక‌ర్షించ‌బ‌డ‌తాయి. క‌నుక బంగారం ద‌గ్గ‌ర అయ‌స్కాంతం ఉంచాలి. బంగారం న‌కిలీ అయితే అయ‌స్కాంతానికి ఆక‌ర్షించ‌బ‌డుతుంది. అంటే అందులో ఇత‌ర లోహాలు క‌లిసిన‌ట్లు అర్థం. న‌కిలీ బంగారాన్ని గుర్తించేందుకు అందుబాటులో ఉన్న సుల‌భ‌మైన ప‌ద్ధ‌తి ఇది.

identify gold like this whether it is fake or original

అస‌లు బంగారం అయితే తుప్పు ప‌ట్ట‌దు. ఏవైనా లోహాలు క‌లిస్తే బంగారంపై తుప్పు వ‌స్తుంది. క‌నుక తుప్పు ఉందా లేదా అని గ‌మ‌నించాలి. తుప్పు ఉంటే ఆ బంగారంలో ఇత‌ర లోహాలు క‌లిసిన‌ట్లు లెక్క‌.

బంగారం అసలుదా, కాదా అని గుర్తించేందుకు హాల్‌మార్క్ స‌ర్టిఫికేష‌న్ దోహ‌ద‌ప‌డుతుంది. బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ (బీఐఎస్‌) బంగారు ఆభ‌ర‌ణాలు, నాణేల‌కు స‌ర్టిఫికెట్లు ఇస్తుంది. అందువ‌ల్ల వాటిపై బీఐఎస్ ధ్రువీక‌ర‌ణ ఉంటుంది. ఆభ‌ర‌ణాలకు వెనుక వైపు బీఐఎస్ ధ్రువీక‌ర‌ణ ముద్రించి ఉంటుంది. నాణేల మీద ఆ ధ్రువీక‌ర‌ణ ఉంటుంది. చాలా సూక్ష్మంగా ఉంటుంది క‌నుక దాన్ని గుర్తించేందుకు చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాలి. ధ్రువీక‌ర‌ణ కనిపిస్తే ఆ బంగారం అస‌లుద‌ని అర్థం.

నీళ్ల‌లో బంగారం ఆభ‌ర‌ణాలు లేదా కాయిన్ల‌ను వేస్తే అది స్వ‌చ్ఛ‌మైన బంగారం అయితే అవి మునిగిపోతాయి.

స్వ‌చ్ఛ‌మైన బంగారం నైట్రిక్ యాసిడ్‌తో చ‌ర్య పొంద‌దు. కాప‌ర్‌, జింక్ వంటి లోహాలు బంగారంలో క‌లిస్తే అవి చ‌ర్య పొందుతాయి. అయితే ఈ టెస్టు చేసేట‌ప్పుడు చాలా జాగ్రత్త‌గా ఉండాలి. చేతుల‌కు గ్లోవ్స్, ముఖానికి మాస్క్ ధ‌రించాలి. గాలి, వెలుతురు బాగా వ‌చ్చే రూమ్‌లో టెస్ట్ చేయాలి. ఒక బ్లాక్ స్టోన్ మీద బంగారు ఆభ‌ర‌ణాన్ని చిన్న‌గా రుద్దాలి. దీంతో ఆ స్టోన్‌పై బంగారం మార్క్ ఏర్ప‌డుతుంది. దానిపై నైట్రిక్ యాసిడ్ డ్రాప్ ఒక‌టి వేయాలి. దీంతో ఆ మార్క్ గ్రీన్ క‌ల‌ర్‌లోకి మారుతుంది. అలా వ‌స్తే అది స్వ‌చ్ఛమైన బంగారం అని అర్థం. లేదంటే పాల వంటి ప‌దార్థం ఏర్ప‌డుతుంది. అంటే అది న‌కిలీ బంగారం లేదా క‌ల్తీ అయిన బంగారం అని అర్థం.

వంట ఇంట్లో ఉండే వెనిగ‌ర్ స‌హాయంతో బంగారు ఆభ‌ర‌ణాల‌ను ప‌రీక్షించ‌వ‌చ్చు. ఆభ‌ర‌ణంపై ఒక చుక్క వెనిగ‌ర్ వేయాలి. దీంతో బంగారం రంగు మారితే అది న‌కిలీ అని, రంగు మార‌క‌పోతే అది అస‌లైన బంగారం అని అర్థం.

బ్లాక్ స్టోన్ మీద బంగారాన్ని రుద్దితే బంగారం రంగులో మార్క్ ఏర్ప‌డుతుంది. అంటే అది స్వ‌చ్ఛ‌మైన బంగారం అని అర్థం. లేదంటే భిన్న రంగులో మార్క్ ఏర్ప‌డుతుంది.

Admin

Recent Posts