information

Post Office RD Scheme : ఇందులో మీరు నెల‌కు రూ.7వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.80వేలు వ‌డ్డీనే వ‌స్తుంది..!

Post Office RD Scheme : ప్ర‌జ‌లు తాము సంపాదించిన డ‌బ్బును పొదుపు చేసి ఇంకా రెట్టింపు ఫ‌లితాన్ని పొందాల‌ని అనేక విధాలుగా డ‌బ్బును పెట్టుబ‌డి పెడుతుంటారు. అందులో భాగంగానే మ్యుచువ‌ల్ ఫండ్స్‌, స్టాక్స్ వంటి వాటి వైపు చూస్తుంటారు. అయితే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డి పెడితే రిట‌ర్న్స్ వ‌స్తే బాగానే ఉంటుంది. కానీ రిస్క్ ఎక్కువ‌. మార్కెట్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియదు. క‌నుక కొంద‌రు వీటిల్లో పెట్టుబ‌డి పెట్టాలంటే వెనుక‌డుగు వేస్తుంటారు. అయితే అలాంటి వారు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌కు చెందిన స్కీముల్లో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. దీంతో డ‌బ్బుకు పూర్తి స్థాయిలో ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అలాగే గ్యారంటీడ్ రిట‌ర్న్స్‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఇక అలాంటి స్కీమ్‌ల‌లో ఒక‌టి పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ స్కీమ్‌. ఇందులో మీరు డ‌బ్బును పెడితే సుర‌క్షితంగా ఉంటుంది. అలాగే గ్యారంటీగా ఆదాయం కూడా వ‌స్తుంది.

పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ (RD) స్కీమ్‌లో పెట్టుబ‌డి పెడితే రూ.80వేల వ‌ర‌కు లాభం పొంద‌వ‌చ్చు. ఇందులో భాగంగా ఏడాదికి మీరు పెట్టే పెట్టుబ‌డిపై 6.7 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. ఈ స్కీమ్ మెచూరిటీ గడువు 5 ఏళ్లు మాత్ర‌మే. 5 సంవ‌త్స‌రాల త‌రువాత మీరు మీ డ‌బ్బును తీసుకోవ‌చ్చు. అన్ని సంవ‌త్సరాలు పాటు పెట్టిన డ‌బ్బుపై పెద్ద ఎత్తున వ‌డ్డీ ల‌భిస్తుంది. ఇక పోస్టాఫీస్ RD స్కీమ్‌లో ఎవ‌రైనా డ‌బ్బును పొదుపు చేయ‌వ‌చ్చు. చిన్నారుల పేరిట కూడా ఈ అకౌంట్‌ను తెర‌వ‌వ‌చ్చు. కానీ వారికి త‌ల్లి, తండ్రి లేదా సంర‌క్ష‌కులు ఉండాలి. అప్పుడు వారి పేరిట అకౌంట్‌ను తెర‌వ‌చ్చు.

Post Office RD Scheme invest rs 7000 per month for rs 80000 interest

క‌నీసం రూ.100 పెట్ట‌వ‌చ్చు..

ఇక Post Office RD స్కీమ్‌లో మీరు ఎంతైనా డ‌బ్బు పెట్ట‌వ‌చ్చు. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండ‌దు. మీ డ‌బ్బుకు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఉంటుంది. క‌నీసం రూ.100 తో అకౌంట్ ఓపెన్ చేయ‌వ‌చ్చు. ఇక గ‌రిష్టంగా ఎంతైనా ఇందులో పెట్ట‌వ‌చ్చు. అందుకు లిమిట్ అంటూ ఏమీ లేదు. అలాగే మీరు ఇందులో పెట్టే డ‌బ్బుకు 6.7 శాతం వ‌డ్డీ వ‌స్తుంది. కానీ కేంద్ర ప్ర‌భుత్వం ఈ వ‌డ్డీ రేట్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మారుస్తుంది. క‌నుక వ‌డ్డీ రేటు పెరిగితే మీకు ఇంకా ఎక్కువ లాభం క‌లుగుతుంది.

మీరు Post Office RD లో నెల‌కు రూ.7000 పెడితే అప్పుడు మీరు 5 ఏళ్ల‌లో పెట్టిన మొత్తం రూ.4,20,000 అవుతుంది. దీంతో మీకు రూ.79,564 వ‌డ్డీ వ‌స్తుంది. ఇలా మీరు ఈ స్కీమ్ ద్వారా రూ.80వేల వ‌ర‌కు పొంద‌వ‌చ్చ‌న్న‌మాట‌. ఇక మెచూరిటీ అయ్యాక మీకు మొత్తం రూ.4,99,564 వ‌స్తాయి.

టీడీఎస్‌ను క్లెయిమ్ చేయ‌వ‌చ్చు..

ఈ స్కీమ్‌లో భాగంగా మీరు నెల‌కు రూ.5000 గ‌న‌క పెడితే మీరు 5 ఏళ్ల‌లో పెట్టిన మొత్తం రూ.3 ల‌క్ష‌లు అవుతుంది. దీనిపై మీకు రూ.56,830 వ‌డ్డీ వ‌స్తుంది. అంటే మెచూరిటీ అయ్యాక మీకు మొత్తం రూ.3,56,830 వ‌స్తాయన్న‌మాట‌. ఇలా Post Office RD స్కీమ్ ప‌నిచేస్తుంది. అయితే ఇందులో మీకు ఏడాదిలో వ‌చ్చే వ‌డ్డీ మొత్తం రూ.10వేల‌కు మించితే అప్పుడు ఆ వ‌డ్డీ నుంచి 10 శాతం టీడీఎస్ క‌ట్ చేస్తారు. కానీ మీరు ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ చేసే స‌మయంలో మీరు ఇన్‌క‌మ్‌ట్యాక్స్ క‌ట్టాల్సిన అవ‌స‌రం లేక‌పోతే అందులో మీరు ఈ టీడీఎస్ మొత్తాన్ని కూడా క్లెయిమ్ చేయ‌వ‌చ్చు. దీంతో క‌ట్ అయిన టీడీఎస్ కూడా మీకు వెన‌క్కి వ‌చ్చేస్తుంది. ఇలా Post Office RD స్కీమ్ ద్వారా మీ డ‌బ్బుకు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ పొందుతూనే మ‌రోవైపు మంచి లాభాల‌ను ఆర్జించ‌వ‌చ్చు.

Admin

Recent Posts