information

గెజిటెడ్‌ ఆఫీసర్ అర్థం ఏమిటి? నిర్దిష్టమైన వ్యక్తులను మాత్రమే మనం గెజిటెడ్ ఆఫీసర్ అని ఎలా గుర్తించగలుగుతాం..?

<p style&equals;"text-align&colon; justify&semi;">1984 వరకూ జిల్లాకి వంద మంది గెజిటెడ్ ఆఫీసర్స్ ఉండేవారు&period; అంతకు పూర్వం1950 లలో రాష్ట్రంలో మొత్తం మూడు వందల లోపు ఉండే వారు&period; ప్రస్తుతం మండలానికే వంద మంది ఉన్నారు&period; బ్రిటిష్ పాలనా కాలంలో&comma; ఏ అధికారి యొక్క&comma; ప్రమోషన్లు&comma; బదిలీలు&comma; అవార్డు లు&comma; పనిష్మెంట్లు&comma; రిటైర్ మెంట్లు వగైరా వంటి సర్వీస్ వివరాలు రాష్ట్ర గెజిట్ పుస్తకంలో ముద్రించడానికి అర్హులో అట్టి వారిని గెజిటెడ్ ఆఫీసర్స్ అని నిర్వచించారు&period; వీరికి అప్పట్లో రాష్ట్ర మంతా బదిలీలు కూడా ఉండేవి&period;సర్వసాధారణంగా గెజిటెడ్ ఆఫీసర్స్ సమ్మె లలో పాల్గొనరు&period; ప్రస్తుతం అత్యవసర చట్టసవరణలు మాత్రమే అవసరం మేరకు గెజిట్ &lpar;రాజపత్రం&rpar;లో ప్రచురించి మిగిలిన వ్యక్తి గతమైనవి ముద్రణ వదిలేస్తున్నారు&period; 1990 వరకూ ప్రతి నెలా ఆంధ్రప్రదేశ్ రాజపత్రం అనే పేరుతో గెజిట్&comma; జిల్లా కలెక్టర్ ఆఫీస్&comma; తహశీల్దార్ ఆఫీస్ లాంటి కొన్ని ముఖ్యమైన ఆఫీసులకు పోస్ట్ లో పంపేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రింటింగ్&comma; స్టేషనరీ ఖర్చు పెరిగిపోవడం వలన ఈ సేవలు ముప్పై ఏళ్ల నుండి నిలిచిపోయాయి&period; రాను రాను ఉద్యోగ సంఘాలు&comma; ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడి&comma; బలం తగ్గించడం కోసం చాలా నాన్ గెజిటెడ్ పోస్ట్ లను గెజిటెడ్ కేటగిరీ లో చేర్చేశారు&period; ఇలా ప్రధానోపాధ్యాయులు&comma; లెక్చరర్స్&comma; సబ్ ఇన్స్పెక్టర్ లు&comma; పశువుల&comma; మనుషులు డాక్టర్లు&comma; ఆఫీస్ సూపరింటెండెంట్ లు&comma; హెల్త్ ఆఫీసర్స్&comma; ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లు&comma; స్కూళ్లు ఇన్స్పెక్టర్ లు&comma; అడిగిన వారందరికీ కాణీ ఖర్చు లేని పని కనుక గెజిటెడ్ గా గుర్తిస్తూ జీవో ఇచ్చి పారేశారు&period; బదిలీలు కూడా కొన్ని పోస్ట్ లు జోనల్ లెవల్&comma; మరికొన్ని జిల్లా లెవెల్ మార్పులు చేశారు&period; అందువలన ఎవరికి వారు కామన్ సెన్స్ ద్వారా వారు గెజిటెడ్ ఆఫీసర్ అవునో కాదో తెలుసు కోవడం తప్ప వీరికి ప్రత్యేక మైన గుర్తింపు చిహ్నాలు ఏమీ ఉండవు&period; పూర్వం గెజిటెడ్ ఆఫీసర్స్ కి ఒక వాహనం&comma; బిళ్ళ బంట్రోతు&comma; టెలిఫోన్ సౌకర్యం లాంటి సదుపాయాలు ఉండేవి&period; ప్రత్యేక అలవెన్సు కూడా నెలకు 200 రూపాయలు ఉండేది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90413 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;gazetted-officer&period;jpg" alt&equals;"who is gazetted officer and what they will do " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1985 నుండి అలవెన్స్ రద్దు చేశారు&period; బడ్జెట్ ఇస్తే అద్దె వాహనాల్లో తిరగవచ్చు&period; మండలాలు వచ్చాక చాలా ఆఫీస్ లలో జీప్ డ్రైవర్&comma; నైట్ వాచ్ మెన్ పోస్ట్ లు పీకి పారేశారు&period; ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన కార్యాలయాలలో కొంత మంది జిల్లా స్థాయి అధికారుల‌కు కూడా కార్యాలయం భవనం&comma; స్టాఫ్&comma; విడిగా ఒక గది&comma; టేబుల్&comma; కుర్చీ&comma; వాహనం&comma; ఫోన్&comma; బంట్రోతు ఏమీ లేకుండా ఉన్నవారు కూడా ఉన్నారని చెప్పడంలో ఆశ్చర్యం లేదు&period; అలాంటి వారు ఏదో మూల ఎక్కడో ఒకచోట కూర్చుని ఉద్యోగం చేసుకుంటూ గడిపేస్తున్నారు&period; గత ప్రభుత్వంలో పేరివిజన్ కమీషనర్ ను నియమించి&comma; వారికి కార్యాలయం&comma; సిబ్బంది&comma; వాహనం ఏమీ కేటాయించకుండా రెండు సంవత్సరాలు గడిపేశారు&period; తరువాత తనకు తాను గానో లేక పై నుండి ఒత్తిడి వల్లనో వారు పదవికి రాజీనామా చేసి వెళ్లి పోయారు&period; అది వేరే విషయం అనుకోండి&period; మొత్తం మీద గెజిటెడ్ ఆఫీసర్ అనే పదం ఉనికిని కనిపెట్ట లేని గందరగోళం కల్పించడం జరిగింది&period;ఉద్యోగులలో ఏ రాయి అయితేనేమి పళ్ళూడకొట్టుకోవడానికి అనిపించే పరిస్థితి ఏర్పడింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts