information

Money Earning : నిరుద్యోగ యువ‌త‌కు చ‌క్క‌ని స్వ‌యం ఉపాధి మార్గం.. చక్క‌ని ఆదాయం పొందే అవ‌కాశం..

Money Earning : కాలం మారుతుంది నేటి యువత ఫ్యాషన్ ప్రపంచం వైపు ఉరకలు వేస్తుంది. యువత ఫ్యాషన్ పరంగా ప్రతి విషయంలోనూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా యువత స్టైల్ కి ఇస్తున్న ప్రాధాన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. దుస్తులు, జ్యుయెలరీ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఆన్లైన్ మార్కెట్ లు అందుబాటులోకి రావడంతో నగరాలలోనే కాదు పల్లెల్లో కూడా ఈ స్టైల్ కి సంబంధించిన వ్యాపారం విస్తృతంగా జరుగుతుంది. ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి సరికొత్త వస్తువులను విడుదల చేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్స్.

ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు మాత్రమే కాదు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఆన్లైన్ మార్కెట్ లో కొనుగోళ్లు చేస్తున్నారు. ఇప్పుడు దీనిని ఆధారంగా చేసుకునే మంచి వ్యాపారం నిరుద్యోగులు చేసుకోవచ్చని సూచిస్తున్నారు వ్యాపార నిపుణులు. ఫ్యాషన్ ప్రపంచానికి సంబంధించిన ఈ వ్యాపారం ఆన్లైన్ ద్వారా లేక డైరెక్ట్ గా ఈ వ్యాపారం బాగుంటుంది అంటున్నారు. కస్ట్యూమ్ జువెలరీ అంటే ఇష్టపడని యువతులు ఉండరు అని అంటున్నారు . ఏ వేడుకలకైనా సరే కస్ట్యూమ్ జువెలరీని ఎక్కువగా వినియోగిస్తారు. ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి పాడేస్తూ ఉంటారు. దీని మీద దృష్టి పెడితే మంచి వ్యాపారం అవుతుందని, దశల వారీగా వృద్ధిలోకి తెచ్చుకోవచ్చని అంటున్నారు నిపుణులు.

with costume jewelry business you can earn good income

ఫ్యాషన్ ప్రపంచం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి కస్ట్యూమ్ జువెలరీ బిజినెస్ కి ఏ ఇబ్బంది ఉండదు. దేశంలో కాస్ట్యూమ్ జువెలరీ మార్కెట్‌లో గణనీయమైన వృద్ధి ఉంది కాబట్టి హోల్‌ సెల్లర్ల నుంచి జువెలరీని కొనుగోలు చేసి, దాన్ని కస్టమర్లకు నేరుగా అమ్ముకోవడం, ఆన్లైన్ లో విక్రయించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం పెట్టుబడి కూడా పెద్దగా అవసరం లేదు. ఫెస్బుక్ లో, ఇంస్టాగ్రామ్ లో దీనిని స్థానికంగా ప్రచారం చేసుకుంటే అక్కడ ఎక్కువగా ఉండే స్థానిక యువత దాని మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారని తద్వారా వ్యాపారం మెరుగుపడుతుంది అంటున్నారు.

ఇక నోటి ప్రచారం ద్వారా కూడా దీనిని ఎక్కువగా వృద్ధిలోకి తీసుకురావచ్చని సూచిస్తున్నారు ఈ కాస్ట్యూమ్ జువెలరీ వ్యాపారంలో సక్సెస్ అయిన వ్యక్తులు. పరిచయాలు పెంచుకుంటే వ్యాపారం ఇంకా పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ వ్యాపారానికి సూట్ అవుతారని వారికి అయితే అవగాహన ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

Admin

Recent Posts