information

రైల్వే ట్రాక్స్ మీద W/L అని ఎందుకు ఉంటుంది..? దాని వెనుక కారణం ఏమిటి..?

కొన్ని కొన్ని సార్లు, మనకి కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. కొత్త విషయాలను తెలుసుకుంటే, ఏదో ఆనందం ఉంటుంది. రైళ్లకి సంబంధించి తెలియని విషయాలు, ఎన్నో ఉంటూ ఉంటాయి. అప్పుడప్పుడు, అవి బయటకు వస్తూ ఉంటాయి. రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే, దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు, ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకుంటూ ఉంటారు. ట్రైన్ లో వెళ్తున్నప్పుడు, బోర్డులు కనపడుతుంటాయి. బోర్డుల మీద కొన్ని సింబల్స్ కూడా ఉంటాయి. W/L అనే బోర్డు మనకి కనబడుతూ ఉంటుంది.

ఎప్పుడైనా మీరు ఎందుకు ఈ బోర్డ్ ఉంది అని ఆలోచించారా..? W/L బోర్డు రైల్వే ట్రాక్ కి రెండు పక్కలా ఉంటుంది. ట్రాకుల మీద, ఈ బోర్డుల్ని ఎందుకు పెడతారు అనే విషయానికి ఇప్పుడు వచ్చేద్దాం. లోకో పైలట్స్ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా నడపాలని, బోర్డులని పెడుతుంటారు. లోకో పైలట్స్ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా నడపాలని మాత్రమే బోర్డులను పెడతారు. రైల్వే శాఖ క్రాసింగ్ కి రెండు పక్కల కూడా, ఈ బోర్డులని పెట్టడం జరిగింది. దీనిని దాటడానికి 600 మీటర్లు ముందే బోర్డు ఉంటుంది.

what is the meaning of wl on railway tracks what is the meaning of wl on railway tracks

దీని మీద నుండి, లోకో పైలట్స్ వెళ్లేటప్పుడు హారన్ కొట్టాలి. ఆ బోర్డు దాటే వరకు కూడా హారన్ కొట్టాల్సి ఉంటుంది. ఎందుకు హారన్ ఇవ్వాలంటే, క్రాసింగ్ వద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. అటువంటి ప్రమాదాలు జరగకూడదని, హారన్ కొట్టమని చెప్తారు. పసుపు రంగు బోర్డు మీద, నల్లటి అక్షరాలు ఉంటాయి.

పసుపు రంగును ఎందుకు వాడతారు అంటే క్లియర్ గా కనబడడం కోసం. దూరం నుండి కూడా క్లియర్ గా కనబడుతుంది. కాబట్టి, అలర్ట్ అవుతారు లోకో పైలట్లు. నేల నుండి ఈ బోర్డు, 2100 మిల్లి మీటర్ల ఎత్తులో ఉండాలట. అలానే ఒక బోర్డు ఇంగ్లీష్ లో ఉంటే, ఇంకొకటి హిందీలో ఉంటుంది. ఇలా రూల్స్ ఉన్నాయి.

Admin

Recent Posts