inspiration

చావు శరణ్యం కాదు.. కష్టాలనధిగమించి బ్రతకడమే జీవితం.. సీతా ఫలం చెప్పిన బోధ..

ఒక నదీ తీరాన ఒక గురువు ఆశ్రమం… ఒక రోజు శిష్యులు నదికి నీరు తేవడానికి వెళితే…. ఒక వ్యక్తి చనిపోవాలని నది నందు దూకుతాడు.. శిష్యులు అతనిని రక్షించి ఆశ్రమానికి తీసుకు వచ్చారు.. ఎందుకు నాయనా చనిపోవాలని ప్రయత్నించావు ?. … జీవితంలో అన్ని కష్టాలే… విసిగి వేసారి పోయాను… ఈ కష్ణాలతో జీవించ లేక చావే శరణ్యమని భావించి అలా చేశాను. స్వామీ… ఇంతలో శిష్యుడు సీతాఫ‌లం పండ్లను కోసి బుట్టనిండా తెచ్చాడు…

అతనికి ఒక పండును ఇచ్చి ఆరగించమని గురువు చెబుతాడు…. అతను తొక్కను గింజలను పడవేసి గుజ్జును తింటాడు… అప్పుడు గురువు పండులో గింజలు తొక్క ఉందని పడవేశావా…. లేదు కదా… అలాగే జీవితంలో సమస్య లుంటాయి… వాటికి దూరంగా పారిపోము.. జీవితాన్ని ముగించు కోము… పండులోని తొక్కలను పడవేశినట్లే…. జీవితంలో చెడ్డవారికి చెడ్డ ఆలోచనలకు దూరంగా బ్రతకాలని చెబుతాడు…. గింజతో పాటే గుజ్జు ఉంటుంది… జీవితంలోను సుఖాలతొ పాటు కష్టాలు ఉంటాయి….

custard apple tells us how to live in life

గింజలను నోటిలో వేసుకొని ఉంచేసి నట్లే జీవిత సమస్యలను పరిష్కరించుకోవాలి… లేకుంటే వాటిని వదిలి వెయ్యాలి… పండులోని గుజ్జును అనుభవించి నట్లే నీకు ప్రసాదింపబడిన జీవిత మకరందాన్ని జుర్రు కోవాలి… అన్నాడు.

Admin

Recent Posts