వినోదం

జాన్వీ క‌పూర్‌కు రూ.5 కోట్ల కారును గిఫ్ట్‌గా ఇచ్చింది ఎవ‌రంటే..?

జాన్వి కపూర్ కు ఇండియాలోని మోస్ట్ బిజినెస్ పర్సన్ ఐదు కోట్ల రూపాయల విలువగల లంబోర్ఘిని కారును గిఫ్ట్ గా ఇవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ కు క్లోజ్ ఫ్రెండ్ అయిన అనన్య బిర్లా ఆ కారు ను బహుకరించడం ఆసక్తికరంగా మారింది. దీంతో జాన్వి కపూర్ కు అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కారును బహుకరించింది ఎవరు అనేది అందరిలో ఆసక్తిని రేకించే అంశంగా మారింది. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి.

ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మెన్ కుమార్ మంగళం బిర్లా కూతురే అనన్య బిర్లా కావడం విశేషం. ఆయన రూ.2150 కోట్ల వరకు ఆస్తులను కలిగి ఉన్నారు. ఆ విషయంలో బ్యూటీ అనన్య బిర్లా బిజినెస్ పర్సన్ గా ఎదుగుతున్నారు. ఆమెకు ముంబైలో జటియా హౌస్ ను కలిగి ఉంది. దాని విలువ 425 కోట్లు ఉంటుందని సమాచారం. గ్లోబల్ గ్రేడ్ ఫార్ములాల తో మాయిశ్చరైజర్స్ ప్రొడక్ట్స్ ను ఉత్పత్తి చేయిస్తుంది.

who is the person given car to janhvi kapoor

అమెరికన్ స్కూల్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లో చదువుకున్న ఆమె సింగర్ గాను గుర్తింపు పొందింది. ఇలా పలు రకాలుగా అనన్య గట్టిగానే సంపాదిస్తుంది. ఆమె ఆస్తుల నికర విలువ 1770 కోట్ల వరకు ఉంటుందని ఫోర్బ్స్ తెలియజేసింది. 30 ఏళ్లలోనే అనన్య బిర్లా అటు సింగర్ గాను ఇటు వ్యాపారవేత్తగాను క్రియాశీలక పాత్రలు పోషిస్తుంది. జాన్వీ కపూర్ కు కార్ గిఫ్ట్ ఇవ్వడంతో వార్తల్లో నిలిచింది. కొత్త బ్యూటీ బ్రాండ్ కు సంబంధించిన ప్రమోషన్ కోసం ఖరీదై బహుమతిని ఇచ్చినట్టు ప్రచారం.

Admin

Recent Posts