ఇద్దరు దంపతులు లేదా ఏదైనా ఓ జంట అన్యోన్యంగా కలసి మెలసి ఉంటున్నారా, లేదా అనేది వారి స్వభావాన్ని బట్టి చెప్పవచ్చు. ఒకరి పట్ల ఒకరు ఇంట్లో, బయట ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దాన్ని బట్టి ఆ జంట మధ్య ఉన్న అన్యోన్యతను గురించి వివరించవచ్చు. అయితే ఇది కాకుండా, జంటలో ఆడైనా, మగైనా ఎవరైనా నిద్రించే స్వభావం, తీరు, భంగిమని బట్టి కూడా వారి మధ్య ఎంతటి ఆప్యాయత ఉందో ఇట్టే తెలుసుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. జంట ఇద్దరూ పడుకునే ముందు ఒకరిపై ఒకరు చేతులు, కాళ్లు వేసుకుని దగ్గరగా ఉంటూ రాత్రయ్యే కొద్దీ దూరంగా జరుగుతూ నిద్రించారనుకోండి, అప్పుడు అలాంటి జంట మధ్య ఎలాంటి అన్యోన్యత ఉంటుందంటే ఇద్దరూ వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకుంటూనే కలిసి ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.
జంట ఇద్దరూ కలుసుకుని కాకుండా అటొకరు, ఇటొకరు శరీరం పెట్టి నిద్రిస్తున్నారనుకోండి, అలాంటి వారి మధ్య రిలేషన్‌షిప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందట. కానీ ఇద్దరూ వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారట. ఒకరి వీపు మరొకరికి తగిలేట్టు జంట పడుకుంటే దాంతో వారి మధ్య కొత్త బంధం బలపడుతున్నట్టు గుర్తించాలి. సాధారణంగా వివాహం అయిన కొత్త దంపతులు ఇలా నిద్రిస్తారట. జంట ఇద్దరూ ఒకర్నొకరు హత్తుకుని రాత్రంతా పడుకుని ఉంటే దాంతో ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ ఉంటుందట. ఇద్దరూ ఒకర్ని విడిచి ఒకరు ఉండలేరట.
దంపతులిద్దరూ ఎదురెదురుగా ముఖాలు పెట్టి టచ్ అవకుండా నిద్రిస్తుంటే ఇద్దరూ తమ భాగస్వామితో అన్యోన్యమైన రిలేషన్‌షిప్‌ను పొందేందుకు చూస్తున్నారని అర్థం చేసుకోవాలి. జంటలో ఆడైనా, మగైనా ఒకరు ఇంకొకరిని వెనక నుంచి హత్తుకుని పడుకుంటే వారు ఎదుటి భాగస్వామికి అత్యంత రక్షణనిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. ఇలాంటి వారికి ఒకరిపై ఒకరికి బాగా నమ్మకం ఉంటుందట. జంటలో ఆడైనా, మగైనా ఎవరో ఒకరు బెడ్ మొత్తం ఆక్రమించి తమ భాగస్వామిని మూలకు నెడుతూ పడుకోబెడితే అలాంటి వారు తమ రిలేషన్ షిప్‌లో బాగా డామినేట్ చేస్తారట.