ఆఫీసులలో ఎన్నో రకాల వ్యక్తులుంటారు. ఏ ఇద్దరికి ఒకే రకమైన ప్రవర్తన వుండదు. ప్రతి వ్యక్తితోను సరైన రీతిలో వ్యవహరించటం ప్రధానం. సంబందాలకోసమే కాదు వారి సాహచర్యంలో కొన్ని ప్రయోజనాలు కూడా పొందవచ్చు. మరి మీ ఆఫీసులో మిమ్మల్ని విసిగించేస్తూ చికాకు పెట్టే సహచర ఉద్యోగి వుంటే అతనిని ఏ రకంగా ఉపాయంతో నెట్టుకురావాలో చూడండి. ప్రతిదానికి మీరు వెనుకాడకండి. వారు మిమ్మల్ని గౌరవించాలి. మీరు వారిని గౌరవించాలి. మాటలవరకు చాలు. కష్టసుఖాలు పంచుకోనవసరం లేదు. వాస్తవాలను గ్రహిస్తూ పాజిటివ్ గా వుండండి.
మాటలలో, చేతలలో కొన్ని హద్దులు పెట్టుకోండి. వారితో ఎక్కువా వద్దు తక్కువా వద్దు. సమంజసంగా వుండండి. ప్రతి విషయం వ్యక్తిగతంగా తీసుకోకుండా వుండటం నేర్చుకోండి. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీ తొందరపెట్టే సహచర ఉద్యోగికి అధికంగా స్పందించకండి. ప్రశాంతంగా వుండటం, గంభీరంగా మాట్లాడటం, మీ మాటలు చేష్టలకు అతను బాధ పడకుండా వుండేలా చూడాలి.
ఆఫీస్ లో హస్కు కొట్టకండి. లేదా గుసగుసల జోలికి పోకండి. మీ సహచర ఉద్యోగితో వ్యవహరించడం కష్టమేమరి. కాని వారి గురించి చెప్పడం లేదా వారి వెనుక మాట్లాడటం చేయకండి. బహుశ అతని లేదా ఆమె వెనక మాట్లాడుతున్నారని తెలిస్తేనే వారు మరింత జిడ్డుగా మీతో వ్యవహరిస్తారు.