Hair Cut : హిందూ ధర్మంలో కొన్ని పనులకు ప్రత్యేకంగా కొన్ని రోజులను కేటాయించారు. ఆ పనులను ఆ రోజుల్లోనే చేయడం వల్ల మనం శుభ ఫలితాలను పొందుతాము. లేదంటే మనం అశుభాన్ని మూటకట్టుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల జీవితంలో అనేక ఇబ్బందులు కలుగుతాయి. అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యేకమైన రోజుల్లోనే, నిర్దేశించిన రోజుల్లోనే చేసే వివిధ రకాల పనులల్లో జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం కూడా ఒకటి. జుట్టును, గోర్లను ఎప్పుడు పడితే అప్పుడు కత్తిరించకూడదు. వీటికి కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. ఆ రోజుల్లోనే జుట్టును కానీ, గోర్లను కానీ కత్తిరించుకోవాలి. జుట్టును మరియు గోర్లను ఏయే రోజుల్లో కత్తిరించుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ ధర్మం ప్రకారం జుట్టు లేదా గడ్డాన్ని సోమవారం కత్తిరించకూడదు.
సోమవారం మహా శివుడికి అంకితమివ్వబడింది. ఈ రోజున జుట్టును కత్తిరించుకోవడం అంత మంచిది కాదు. ఇది మానసిక క్షోభకు గురి చేస్తుంది. అలాగే మంగళవారం కూడా జుట్టును కత్తిరించుకోకూడదు. మంగళవారం జుట్టును కత్తిరించుకోవడం వల్ల ఆయుష్షు క్షీణిస్తుందని పెద్దలు చెబుతున్నారు. జుట్టును, గడ్డాన్ని బుధవారం నాడు కత్తిరించుకోవడం మంచిది. బుధవారం నాడు జుట్టును కత్తిరించుకోవడం వల్ల జీవితంలో కష్టాలు తగ్గడంతో పాటు మనకు మంచి కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు.అలాగే గురువారం నాడు కూడా జుట్టును కత్తిరించుకోకూడదు. గురువారం నాడు జుట్టు కత్తిరించుకుంటే అదృష్టం దురదృష్టంగా మారుతుందని అంతేకాకుండా మన గౌరవం కూడా తగ్గుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక శుక్రవారం నాడు మం జుట్టును కత్తిరించుకోవచ్చు. శుక్రవారం నాడు జుట్టును కత్తిరించుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
జీవితంలో పురోగతి ఉండడంతో పాటు సుఖ శాంతులు నెలకొంటాయి. ఇక శనివారం జుట్టును, గోర్లను కత్తిరించకూడదు. ఇలా చేయడం వల్ల శని దేవుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. శనివారం జుట్టు, గోర్లు కత్తిరించుకోవడం చాలా అశుభమని పండితులు చెబుతున్నారు. దీని వల్ల మనం ఆర్థిక సమస్యలతో పాటు మానసికపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆదివారం నాడు సెలవు కాబట్టి చాలా మంది ఆదివారం జుట్టు కత్తిరించుకుంటూ ఉంటారు. కానీ ఆదివారం కూడా జుట్టును కత్తిరించుకోవద్దు. ఆదివారం నాడు జుట్టును కత్తిరించుకోవడం వల్ల జీవితంలో పురోగతి తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని పండితులు చెబుతున్నారు.