అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

సెల్ ఫోన్ ద‌గ్గ‌ర‌గా ఉన్నా, దూరంగా ఉన్నా మ‌నకు ముప్పేన‌ట‌..!

సెల్ ఫోన్ నుండి రేడియేషన్ తగలకుండా దానిని శరీరానికి వీలైనంత దూరంగా వుంచటం మంచిదని సైంటిస్టులు చెపుతున్నారు. సెల్ ఫోను పై ప్రపంచ వ్యాప్తంగా అవలంబిస్తున్న సురక్షిత విధానాలు, ప్రచురించిన ఇతర పరిశోధనలను స్టడీ చేసిన ఎన్విరాన్ మెంటల్ హెల్త్ ట్రస్ట్ ప్రెసిడెంట్ డేవరా లీ డేవిస్ ఈ సూచనలు చేశారు. ఫ్రాన్స్, ఇజ్రాయల్, ఫిన్లాండ్, ఇండియా మొదలైన దేశాలలో సెల్ ఫోన్ ల వలన కలుగుతున్న ప్రమాదాల వలన కొన్నిసెల్ నిరోధక విధానాలు కూడా చేశారు. రేడియేషన్ కారణంగా సెల్ ఫోన్ వలన కలిగే ఆరోగ్యపర రిస్కులను తగ్గించటానికి చిన్నపాటి సులభమైన మార్గాలు ఆచరించాలన్నారు.

సెల్ ఫోన్ ఉపయోగించినా, ఉపయోగించకపోయినా, ఆన్ చేసి వుంటే చాలు దానివలన ఏర్పడే మైక్రోవేవ్ రేడియేషన్ శరీరంపై చెడు ప్రభావం చూపుతుంద‌ని చెబుతూ సెల్ ఫోన్ ఉపయోగాన్ని అవసరానికి తగ్గట్టు ఎలా ఉపయోగించాలనేదానిపై డేవిస్ కొన్ని సిఫార్సులు చేశారు. సెల్ ఫోన్ కు సంబంధించి.. యువతలో బ్రెయిన్ కేన్సర్, వీర్యం కదలికలు, లభ్యతలు, దీర్ఘకాలంలో కలిగే ఆరోగ్య ప్రభావం, వృద్ధులలో కలిగే మతిమరుపు వ్యాధి మొదలైన అంశాలపై డేవిస్ ఇంకా పరిశోధన చేస్తున్నట్లు తెలిపారు.

cellphone radiation is very dangerous to our health

సెల్ ఫోన్ తో ఏర్పడే అనారోగ్య ప్రభావాలను ప్రజలు అవగాహన చేసుకునేలా పరిశ్రమ, ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఫోన్ ఉపయోగంలో బ్రెయిన్ లేదా శరీరానికి దూరం పెట్టడం సురక్షితమని డేవిస్ తెలిపారు. స్మార్ట్ సెల్ ఫోన్ ల తో వచ్చే పుస్తకాలలో ఇస్తున్న హెచ్చరికలు సైతం ఫోన్ ను బ్రెయిన్ లేదా శరీరానికి దగ్గరగా వుంచవద్దని, లేదా పాకెట్ లో పెట్టవద్దని చెపుతున్నాయని తెలిపారు. డేవిస్ రాసిన ఆర్టికిల్ ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ ధిరపీస్ అనే పుస్తకంలో ప్రచురించారు.

Admin

Recent Posts